మత్స్య శాఖా సబ్సిడీ వాహనాలు,సామగ్రి పంపిణీ
పంపిణీ కార్యక్రమం లో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్…
ఈరోజుటీవి/జగిత్యాల/టౌన్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మత్స్య శాఖ మత్స్య శాఖ సబ్సిడీ వాహనాల పంపిణీ కార్యక్రమం లో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. ఈ నేపధ్యం లో ఆయన మాట్లాడుతూ సమీకృత మత్స్య అభివృద్ధి పథకం లో భాగంగా తెలంగాణ రాష్ట్రం కు వెయ్యి కోట్లు కేటాయించినారని, గంగపుత్రులకు గతంలో చెరువులపై ఆధిపత్యం ఉండకూడదని సొసైటీలను ఏర్పాటు చెయ్యడం జరిగిందని అన్నారు. అలాగే తెరాస ప్రభుత్వం ముందు చూపు తో రాష్ట్రం లో మిషన్ కాకతీయ ద్వారా 175 చెరువులు పూడిక తీయడం జరిగిందని, అలా చేయడం తో భూగర్భ జలాలు పెరగడం తో పాటు వ్యవసాయం కు అలాగే మత్స కార్మికులకు మరింత అభివృద్ధికి తోడ్పాటు అయ్యేఅవకాశం లేకపోలేదని ఆయన స్పష్టం చేసారు. మునుపెన్నడూ లేని విధంగా గంగపుత్రులు అభివృద్ధి పథం లో ముందుంచడానికి ఉచితంగా చేప పిల్లల పంపిణీ చేయడం జరుగుతున్నదని ఈ సందర్బంగా గుర్తు చేసారు.
అలాగే తెరాస ప్రభుత్వం మత్స్య కారులను ధనవంతులను చెయ్యాలని నిరంతరం కృషి చేస్తుందన్నారు. ఇవే కాకుండా మత్స కార్మికులు పట్టె చేపల ను రవాణా నిమిత్తం అర్హులైన వారందరికీ బొలెరో వాహనాలు , టీవీఎస్ ఎక్సెల్ , ఐస్ బాక్స్ లు , వెయింగ్ మిషన్ల పంపిణీ చెయ్యడం జరిగిందని స్పష్టం చేశారు. అలాగే చేపల ఉత్పత్తికి తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది అని స్పష్టం చేసిన ఆయన రానున్న రోజుల్లో వరద కాలువ జీవ నదిలా మారనుందని ఆశాభావం వ్యక్తం చేసినారు. అలాగే గ్రామాల్లో ఆర్థిక సంపద పెంపొందించే దిశగా సీఎం కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు.
ఇది ఇలాగ ఉండగా గతం లో చెరువుల ధ్వంసం చేసింది ఎవరు ..? ఒక సారి గుర్తుకు తెచ్చుకోవాలి. సామాజిక బాధ్యతతో చెరువులను పరిరక్షించుకోవాలి ..
మహిళా సొసైటీ లు , మార్కెటింగ్ వ్యవస్థ ఏర్పాటుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నదని ఆయన స్పష్టం చేశారు. నన్ను భారీ మెజార్టీతో గెలిపించిన మీకు అందుబాటులో ఉండి సేవ చేస్తానాని అన్నారు..సుమారు 25 కోట్ల విలువ గల లబ్ది కేవలం జగిత్యాల గoగపుత్రులకు దక్కిందని ఆయన స్పష్టం చేశారు. ఇందులో మొత్తం లబ్ధిదారులు 1824 మంది ఉండగా ప్రస్తుతం మొదటి దశలో 290 మందికి అందజేశారని తెలిపినారు. జగిత్యాల పట్టణ పరిధి లో 105 మంది లబ్ధిదారులకు సబ్సిడీ వాహనాలు ఈ రోజు అందజేస్తున్నామని తెలిపారు. గంగపుత్రుల సమస్యల పరిష్కారం కొరకు మత్స్య శాఖా సహకరించాలి అని అధికారులకు విజ్ఞప్తి చేశారు.వారికి ఎప్పటికప్పుడు అవసరమైన సామాగ్రి అందించాలి అని ఈ సందర్బంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో రాణా ప్రతాప్, జుంబర్తి శంకర్, రైతు సమన్వయ సమితి అర్బన్ అధ్యక్షుడు జుంబర్తి శంకర్, గుమ్ముల అంజయ్య, బింగి రాజేశం, చందా పృథ్వీదర్ రావు, జుంబర్తి కుమార్, ఉమెoదర్, గంగారాం తదితరులు పాల్గొన్నారు.