Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

ఎన్నికలకు సిద్ధం కండి

ఈరోజుటీవి/మహబూబ్ నగర్/భూత్పూర్: మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలో భూత్పూర్ మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్యనాయకుల, కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న దేవరకద్ర నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ డోకూర్ పవన్ కుమార్.

పవన్ కుమార్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బ్యాలెట్ ద్వారానే ఎన్నికలు జరుగుతాయి కావున ఎటువంటి అక్రమాలకు పాల్పడే అవకాశం ఉండదు. కావున మన కాంగ్రెస్ పార్టీ తరుపున నిలబడే అభ్యర్థిని గెలిపించడానికి కార్యకర్తలు కృషిచేయాలని అన్నారు.

నియోజకవర్గ ప్రజలందరికీ విజ్ఞప్తి నీతినిజాయితీలు కలిగిన వ్యక్తికే ఓటేసి సర్పంచ్ గా ఎన్నుకోండి. కొంతమంది టీఆర్ఎస్ నాయకులు స్టేట్ లో మా గవర్నమెంట్ ఉంది. కాబట్టి సర్పంచ్ ను కూడా మా పార్టీ అభ్యర్థినే గెలిపించాలని అలా గెలిపిస్తేనే అభివృద్ధి జరుగుతుంది అని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. గుడ్డిగానమ్మి అవినీతి పరులకు ఓట్లేస్తే అభివృద్ధి సంగతి దేవుడెరుగు మిమ్మల్ని నిలువునా ముంచుతారు. కాబట్టి నిజాయితీపరులకు మాత్రమే ఓటేసి సర్పంచ్ గా ఎన్నుకోండి. మీ గ్రామ అభివృద్ధి మీ చేతుల్లోనే ఉంది.

గ్రామ పంచాయితీకి 14 వ ఆర్థిక సంఘం నిధులే వస్తాయి కాబట్టి మనకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు పెద్దగారావు కేంద్రం నుండి వచ్చే నిధులను సద్వినియోగ పర్చే సర్పంచ్ ను ఎన్నుకోండి అని తెలియచేశారు.

ఈ కార్యక్రమంలో భూత్పూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నరసింహ రెడ్డి, హర్యానాయక్, సాధిక్, గల్ రెడ్డి, ఫసియుద్దీన్, శ్రీకాంత్ రెడ్డి, గూటం శ్రీను, తిరుపతి రెడ్డి, ఫారూఖ్, సీతారాంనాయక్ , పాషాతో పాటు భూత్పూర్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Please follow and like us:

You may also like...