Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

పంటకు నీరు అందించాల్సిందే ?

 డీ 83  బి  కెనాల్ ద్వారా పంటలకు సాగునీరు అందించి రైతులను ఆదుకోవాలని కోరుతూ…

ఈరోజుటీవి/ధర్మారం/టౌన్: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని అంబెడ్కర్ చౌరస్తా వద్ద రాస్తారోకో చేయడం జరిగింది. అనంతరం మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు మీడియాతో మాట్లాడుతూ శాసనసభ ఎలక్షన్స్ లో ఎనిమిది వారబంది తడులు ఇచ్చి రైతులను ఆదుకుంటామని చెప్పిన ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ కనబడటం లేదని, కొప్పుల ఈశ్వర్ గారికి మంత్రి పదవి పై ఉన్న శ్రద్ధ రైతులపై లేదని విమర్శించారు. ఎస్సారెస్పీ మరియు ఎల్లంపల్లి ద్వారా సాగునీరు ఇచ్చి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.సాగునీరు విడుదల చేయని యెడల రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు పూస్కూరు రామారావు,వైస్ ఎంపీపీ నార ప్రభాకర్, కాంగ్రెస్ పార్టీ ధర్మారం మండల అధ్యక్షులు ఆవుల శ్రీనివాస్, ధర్మారం మాజి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పాలకుర్తి రాజేశం గౌడ్,సాగంటి కొండయ్య,ఎంపీటీసీ సభ్యులు బొల్లి స్వామి, గాగిరెడ్డి తిరుపతిరెడ్డి,యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు గందం మహిపాల్, మాజీ సర్పంచ్ గందం మల్లయ్య, గాజుల రాజు, మోటపలుకుల అశోక్, ఆకారి మహేష్, రామడుగు గంగారెడ్డి, ఎదుల్ల అంజయ్య,గౌడ గోవింద్, నాడెం శ్రీనివాస్, కోమటిరెడ్డి దేవేందర్ రెడ్డి,నార లక్ష్మణ్, రెవెల్లి తిరుపతి, కత్తెర్ల రమేష్, కాంపెళ్లి పోచయ్య, లాఉద్య కుమార్, పాలగాని రాజమల్లు, పోల్ దాసరి సంతోష్ , వడ్లకొండ అంజయ్య మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Please follow and like us:

You may also like...