Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

జనాభా లెక్కల ప్రకారమే రిజర్వేషన్లు

ప్రతిపక్షాలు కావాలనే ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయి…ఎమ్మెల్యే సంజయ్ కుమార్.

ఈరోజుటీవి/జగిత్యాల/టౌన్: జగిత్యాల పట్టణంలోని తెరాస పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ జగిత్యాల కాంగ్రెస్ నాయకులు స్థానిక సంస్థల రిజర్వేషన్, రాష్ట్ర స్థాయి రిజర్వేషన్ లు, మైనారిటీ, గిరిజనులకు పెంచాలని సదుద్దేశంతో తెరాస ప్రభుత్వం ఉంటే, ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం అని లేకపోతే స్థానికంగా అవకతవకలు చేసారని, స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పుడు వస్తున్నప్పటికీ, అంత కంటే ముందే అంటే ఈ ప్రక్రియ 2017 సంవత్సరంలోనే తెలంగాణ రాష్ట్రంలో రిజర్వేషన్ పెంచాల్సిన అవసరం ఉన్నదని దానికి అనుగుణంగా 62% రిజర్వేషన్ పెంచుకుంటామని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపడం జరిగిందని స్పష్టం చేసినారు. ఇది ఇలాగ ఉండగా పార్లమెంట్ లో మా పార్టీకి చెందిన అంటే తెరాస ఎంపీలు అనేక రకాలుగా రిజర్వేషన్ అంశాన్ని లేవనెత్తారు అని గుర్తు చేసిన ఆయన కాంగ్రెస్ పార్టీ ముస్లిం లకు 5 % రిజర్వేషన్ ఇస్తే కోర్ట్ కొట్టివేసిందని గుర్తు చేశారు.

అప్పుడు వారు దానిని 4% చేసారని, 50 %రిజర్వేషన్ దాటిందని జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ రావాలంటే పార్లమెంట్ లో ఆమోదం చెందాలని ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, మాకు చిత్తశుద్ధి ఉందని కాబట్టే పార్లమెంట్ లో ఒక సెషన్మొ త్తం కూడా డిమాండ్ చేయడం జరిగిందని రిజర్వేషన్ అంశం గురించి కాంగ్రెస్ ఎంపీ లు ఏనాడైనా మాట్లాడారా అని ప్రశ్నించారు. ఇది ఇలాగ ఉండగా తెరాస ఎంపీలు అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ కు మద్దతు తెలుపుతూనే, తెరాస ప్రభుత్వం కేంద్రానికి రిజర్వేషన్ పెంపు అంశంపై రాష్ట్రాలకు అధికారం ఇవ్వాలని తెరాస ప్రభుత్వం కేంద్రం పై ఒత్తిడి తెచ్చిందని ప్రతిపక్ష నాయకులు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో మైతాపూర్, మోతే, పెంబెట్ల లో యస్.సి రిజర్వేషన్ కావలసి ఉండే అని అంటున్నారని అన్నారు. అయితే 2014 లో జరిగిన ఎన్నికలు, 2019 లో జరుగుతున్న ఎన్నికలు, 2011 జనాబా లెక్కల ప్రకారం జరుగుతున్నవని ప్రతిపక్ష నాయకులు ప్రజలను కావాలని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని, ఇలా అమాయక ప్రజలను తప్పుద్రోవ పట్టించడం సరైంది కాదని జగిత్యాల నియోజకవర్గంలో చిన్న గ్రామాలను యస్.సి రిజర్వేషన్ చేసారని ప్రతి పక్ష నాయకులు చెప్తున్నారు. కానీ జగిత్యాల లోని పెద్ద గ్రామాలు ధరూర్, మోరపెల్లి, అంతర్గాం, లక్ష్మీపూర్ గ్రామ పంచాయతీ లు యస్.సి కేటగిరీ గా ఉన్నాయని గుర్తు చేశారు. రిజర్వేషన్ ల గురించి తెరాస ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో గట్టు సతీష్, జుంబర్తి శంకర్, అయిల్నేని ఆనంద్ రావు, దావ సురేష్, ఆది రెడ్డి, గంగం స్వామి, బాలే సత్యనారాయణ, అనుమల్ల సూర్య ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

Please follow and like us:

You may also like...