Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

టీఎన్జీవో,టిటియు ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు…

ఈరోజుటీవి/జగిత్యాల/టౌన్: జగిత్యాల పట్టణంలోని పురాణి పేట పాఠశాలలో బుధవారం రోజున టీఎన్జీవో& టీ టీ యు జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో ముందస్తుగా సంక్రాంతి పండుగ ను పురస్కరించుకుని పురానిపేట ఉన్నత పాఠశాలలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ సతీమణి రాధిక వచ్చి మహిళా ఉద్యోగులు, ఉపాధ్యాయులు ముగ్గుల వేసి అందంగా రంగు రంగుల కలర్ లతో ముగ్గులను వేసి అందరిని ఆశ్చర్య పరిచారు. ప్రతిరోజూ ఉద్యోగ రీత్యా బిజీ ఉండి నేటి కలంలో ఈ లాంటి కార్యక్రమంలో పాల్గొనడం వల్ల ఉద్యోగుల్లో కొంత ఉత్సహం నింపిందని అభినందించారు. అనంతరం బహుమతులు వితరణ జరుపగా, బహుమతుల దాతగా గీత సిల్క్ హౌస్ అధినేత వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో గౌరవ అధ్యక్షుడు హరి అశోక్, టీఎన్జీవో అధ్యక్షులు భోగ శశిధర్, ప్రధాన కార్యదర్శి ఆకుల సత్యం, రెవెన్యూ ఉద్యోగుల అధ్యక్షుడు వకీల్, చెలుకల కృష్ణ , తెలంగాణ టీచర్స్ యూనియన్ టీ.టీ.యు జగిత్యాల జిల్లా అధ్యక్షులు నునావత్ రాజు, ప్రధాన కార్యదర్శి వుజగిరి జమున రాణి, అసోసియేట్ అధ్యక్షుడు సంసుద్దీన్,రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

Please follow and like us:

You may also like...