Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

పిరం కానున్న కొండగట్టు అంజన్న లడ్డు

ఫిబ్రవరి1 నుంచి ధర అమలు లోకి రానుంది…

ఈరోజుటీవీ/కొండగట్టు: జగిత్యాల జిల్లా మల్యాల మండలం లోని కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఒక్కో లడ్డుపై రూ.5 ఫిబ్రవరి1 నుండి పెరగనుంది ఇప్పటికే దీనిపై దేవాదాయ కమిషనర్ ఆమోదానికి దేవస్థానం అధికారులు నివేదిక పంపించారు. ఫిబ్రవరి1 నుంచి ఒక్కో లడ్డుపై రూ, 20 కి విక్రయించడానికి తగిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. కొండ గట్టు దేవస్థానం పరిధిలో ప్రసాద కౌంటర్ల ద్వారా ప్రస్తుతం 200 గ్రాముల పులిహోరాను రూ. 10/- తో పాటు 100గ్రాముల లడ్డును రూ. 15కు విక్రయిస్తున్నారు. అయితే పులిహోర ధరను యథాతథంగా ఉంచుతూ లడ్డు ధరను మాత్రమే పెంచుతున్నారు. ఇది ఇలాగ ఉండగా ఇప్పటికే రాష్ట్రంలోని యాదగిరిగుట్ట, వేములవాడ, ధర్మపురి, భాసర పలు దేవాలయాల్లో లడ్డును రూ. 20 కి విక్రయిస్తున్నారు. కొండగట్టు లో మాత్రం ధరను పెంచక రూ. 15 కే ప్రస్తుతం భక్తులకు విక్రయిస్తున్నారు. రూ. 15 కు విక్రయించడం వల్ల నష్టమేమి లేక పోయినప్పటికి మిగితా ఆలయాల్లో లడ్డు ధర పెంచి అమలు చేయడం, చిల్లర సమస్యలు తలెత్తడంతో లడ్డు ధరను పెంచడానికి అధికారులు నిర్ణయించారు ఈవిషయంపై ఆలయ ఈవో పి. అమరేంధర్ కూడా లడ్డు ధరను పెంపును ధృవీకరించారు.

Please follow and like us:

You may also like...