పట్టణ అభివృద్ధికి పాటుపడతా: ఎమ్మెల్యే సంజయ్
ఈరోజుటీవి/జగిత్యాల/టౌన్: జగిత్యాల పట్టణంలోని 27 వ వార్డ్ ఎలుకబావి వార్డు, యస్.సి కాలనీలో ఉన్నటువంటి బోర్ మోటార్ పని చేయక గత కొంతకాలంగా వార్డు ప్రజలు నీటి సమస్యతో ఇబ్బందులు పడుతుందటము తో ఈ రోజు స్థానిక ఎమ్మెల్యే డా, సంజయ్ కుమార్ వార్డ్ ను సందర్శించారు. ఈ సందర్బంగా ఆయన నీటి సమస్యను తెలుసుకొని మునిసిపల్ అధికారులుతో మాట్లాడి త్వరగా బోర్ మోటార్ మరమ్మత్తు వెంటనే చేపట్టాలని సూచించారు. అలాగే మిషన్ భగీరథ అధికారులతో మాట్లాడి పైప్ లైన్ వేయాలని తెలిపారు. ప్రజల సమస్యల పై అధికారులు సానుకూలత వ్యక్తం చేశారని అన్నారు. జగిత్యాల పట్టణ అభివృద్ధికి కృషి చేస్తానని, సీసీ రోడ్లు, మురికి కాలువల నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట తెరాస పట్టణ అధ్యక్షుడు గట్టు సతీష్, మాజీ కౌన్సిలర్ సమీండ్ల శ్రీనివాస్, నాచుపెల్లి రెడ్డి, గుమ్ముల శంకర్, జుంబర్తి రమేష్, అరుముళ్ల పవన్, నారాయణ, మల్లేష్ యాదవ్, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.