Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

గ్రామ రెవెన్యూ సహాయకుల సమస్యలు పరిష్కరిస్తా: ఎమ్మెల్యే సంజయ్

సమస్య ను కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు వెల్లడి…

ఈరోజుటీవి/జగిత్యాల/టౌన్: జగిత్యాల పట్టణంలోని తెరాస పార్టీ కార్యాలయంలో జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ కు తెలంగాణ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంజయ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో విఆర్ఏలు వంట వార్పు, సకల జనుల సమ్మెలో ఎంతో కీలకపాత్ర పోషించారాని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉద్యోగులకు 43% ఫిట్మెంట్, ఆర్ టి సి కార్మికులకు 44% ఫిట్మెంట్, కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటే ప్రతి పక్షాలు కోర్ట్ కేస్ లు పెడుతున్నాయని, విద్యుత్ విభాగంలో 23వేల ఆర్టిజన్ కార్మికులను పర్మినెంట్ చేసారని కాంట్రాక్టు ఉద్యోగులకు మంచి జీతభత్యాలు అందిస్తున్నారని, విఆర్ఏ లకు 6 వేల నుండి 10 వేలకు జీతం కేసీఆర్ పెంచారని విఆర్ఏ ల డిమాండ్లను సీఎం కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జగిత్యాల జిల్లా విఆర్ఏ సంఘం అధ్యక్షులు చెలిమేల రాజయ్య, ఉపాధ్యక్షుడు పంగ రాజేశం, ద్యాగల గంగారాం, వెంకట్రాజం తో పాటు విఆర్ఏ లు తదితరులు పాల్గొన్నారు.

Please follow and like us:

You may also like...