Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

11న రాహుల్ గాంధీ దుబాయి సభను విజయవంతం చేయండి

రేపు దుబాయిలో రాహుల్ సభ…

ఈరోజుటీవి/జగిత్యాల/టౌన్: ఎఐసిసి అధ్యక్షులు రాహుల్ గాంధీ ఈనెల 11న యూఏఈ దేశంలోని దుబాయి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో సాయంత్రం 4 గంటలకు భారీ సభలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. రాహుల్ సభను విజయవంతం చేయాలని, ఉచిత ప్రవేశం కొరకు www.rginuae.com లో పేర్లు నమోదు చేసుకోవాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి మంద భీంరెడ్డి గల్ఫ్ ప్రవాసులకు పిలుపునిచ్చారు. మహాత్మా గాంధీ 150వ జయంతిని పురస్కరించుకొని “గాంధీ 150 సంవత్సరాలు – భారతదేశం యొక్క ఆలోచన” అనే అంశంపై సభలో రాహుల్‌ ప్రసంగిస్తారు. గల్ఫ్ దేశాలలో సెలవు దినమైన శుక్రవారం రోజున నిర్వహిస్తున్న ఈ సభలో పాల్గొనే కార్మికుల కోసం వారు నివసిస్తున్న లేబర్ క్యాంపుల నుండి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామని వివరాల కోసం వాట్సప్ నెంబర్ +91 98494 22622 కు సంప్రదించవచ్చని మంద భీంరెడ్డి తెలిపారు.

Please follow and like us:

You may also like...