Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

7వ రోజు 6వ విడత జన్మభూమి కార్యక్రమం..

కర్నూలు జిల్లా,
మహానంది/తమడపల్లె,
ఈరోజు టీవీ న్యూస్:
6 వ విడత జన్మభూమి కార్యక్రమంలో భాగంగా 7 వ రోజు మహానంది మండలం తమడపల్లె గ్రామంలో నోడల్ అధికారి బ్రహ్మం అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ముందుగా ముఖ్యమంత్రి సందేశమును ఎం ఈ ఓ.రామసుబ్బయ్య చదివి వినిపించారు. మరోసారి ఉపాధి హామీ ఏ పీ ఓ మనోహర్ బాబు తన కోకిల గానంతో పాట పాడి అలరించారు. అధికారులు అందరూ గ్రామస్థులు నుండి వచ్చిన అర్జీలు తీసుకున్నరు.ఈ జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో వచ్చిన అర్జీలను తొందరగా పరిష్కరిస్తాము అని ప్రజలకు హామీ ఇచ్చారు. అధిక సంఖ్యలో గ్రామస్థులు రేషన్ కార్డులు మంజూరు చేయాలని అధికారులు ను కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ నరసింహులు, తహశీల్దార్ సుబ్బారాయుడు, వెలుగు ఏ పీ ఎం తిరుపాల్ రెడ్డి, అగ్రికల్చర్ అధికారులు సుబ్బారెడ్డి, బాల లింగమయ్యా, ఈ ఓ ఆర్డీ మహబూబ్ ఖాన్, డాక్టర్ చంద్రశేఖర్, ఇంఛార్జి వి ఆర్ ఓ వెంకటరమణ, పంచాయతీ కార్యదర్శి భాస్కర్, సీబీన్ ఆర్మీ కర్నూలు జిల్లా సెక్రటరీ పెద్ది నాగశేఖర్, శ్రీశైలం నియోజకవర్గ సెక్రటరీ జయకృష్ణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Please follow and like us:

You may also like...