Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

సమ్మెలో డ్రైవర్ జాయింట్ యాక్షన్ కమిటీ

ఆగిపోనున్న మూడు,నాలుగు చక్రాల కిరాయి వాహనాలు

తెలంగాణ టాక్సీ అండ్ డ్రైవర్స్ జాయింట్ ఆక్షన్ కమిటీ, మోటార్ వాహన (సవరణ) బిల్లు 2017 కు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న చైర్మన్ షేక్. సలావుద్దీన్.

సమ్మె డిమాండ్లు
1.డ్రైవర్స్ వెల్ఫేర్ బోర్డ్ కల్పించాలి.
2.కనీస వేతనం నెలకు రూ.18 వేలుగా నిర్ణయించాలి.
3.కాంట్రాక్ట్, ఔట్సోర్చింగ్ విధానాన్ని రద్దుచేసి రెగ్యూలరైజ్ చేయాలి.
4.సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి.
5.రోడ్ ట్రాన్స్పోర్ట్ మరియు విద్యుత్ చట్టసవరణ బిల్లును ఉపసంహరించుకోవాలి.
6.పీఎఫ్,ఈఎసై,బోనస్ చట్టాలను విధిగా అమలు చేయాలి, అందరికి పెన్షన్ రూ.6 వేలుగా నిర్ణయించాలి.

అన్ని జిల్లాలో సమ్మె విజయవంతం చేయాలి. బిల్లుపై తమ సమస్యలను, ఆందోళనలను పెంచుతాం. అది కార్మికుల సమస్యలను మరింత తీవ్రతరం చేస్తుంది. బిల్లును ప్రవేశపెట్టిన తరువాత రవాణా కార్మికులు మరియు సంఘాలు సవరణలను వ్యతిరేకిస్తున్నాయి.అలాగే, “అగ్రిగేటర్” అనే పదాన్ని బిల్లులో చేర్చారు, ఇది ఎమ్.వీ. చట్టం సవరణ, 1988, సెక్షన్ 93 కింద. చట్టసభ సభ్యులు మళ్లీ అగ్రిగేటర్ మరియు రహదారి ప్రమాదాలు మధ్య సంబంధాన్ని ప్రశ్నిస్తాం.

దేశంలో ఉన్న అన్ని డ్రైవర్ రంగాలు ఐక్యంగా ఉద్యమించాలని, అందులో భాగంగా 2019 జనవరి 8,9 తేదీలలో జరిగే సార్వత్రిక సమ్మె పిలుపును విజయవంతం చేయాలనీ కోరుతున్నాము. రోడ్డు ప్రమాదాల్లో తక్కువ సంఖ్యలో జరిగే జరిమానాలలో మార్పు ఏర్పడుతుందని నేను ఆశిస్తున్నాను.

తెలంగాణ టాక్సీ అండ్ డ్రైవర్స్ జాయింట్ ఆక్షన్ కమిటీ, చైర్మన్. షేక్. సలావుద్దీన్, కె ఈశ్వర్ రావు , కొండల్ రెడ్డి , రాజ్ శేఖర్ రెడ్డి , ఏ. నగేష్ కుమార్ ,పి రాజు యాదవ్ ,రాజు గౌడ్, రాజు గౌడ్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

Please follow and like us:

You may also like...