Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

వందేమాతరం శ్రీనివాస్‌కు అరుదైన అవకాశం…!

ఈరోజుటీవి/ఒంగోలు/టౌన్ : ప్రముఖ సినీ సంగీత దర్శకుడు, నేపథ్య గాయకుడు వందేమాతరం శ్రీనివాస్‌కు అరుదైన అవకాశం దక్కింది. రాష్ట్ర సంగీత, నృత్య అకాడమీ చైర్మన్‌గా ఆయన నియమితులయ్యారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారని తెలుస్తోంది. ఈ నేపధ్యం లో నేడో రేపో నియామక ఉత్తర్వులు రానున్నాయని అధికార వర్గాల వివరాల ప్రకారం తెలుస్తున్నది. అయితే ఇది ఇలాగ ఉండగా తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాలోని ఓ కుగ్రామానికి చెందిన వందేమాతరం శ్రీనివాస్‌ కళాకారుడిగా జిల్లాలోనే మొదట ఓనమాలు నేర్చుకుని అంచలంచెలుగా ఎంతో ఎదిగారు. అయితే ఆయన విద్యాభ్యాసం మాత్రం ఒంగోలులో కోన సాగిందని తెలుస్తున్నది. ఒంగోలు జిల్లా ప్రజలకు సుపరిచితుడైన సీపీఐ సీనియర్‌ నాయకుడు, ప్రజానాట్యమండలి గౌరవాధ్యక్షుడు నల్లూరి వెంకటేశ్వర్లు (అన్న) శ్రీనివాస్‌లోని ప్రతిభను చిన్నతనంలోనే గుర్తించి ఒంగోలు తీసుకువచ్చారు. తన ఇంట్లోనే ఉంచుకొని ఆయనకు అవసరమైన శిక్షణ ఇచ్చారు.

ఒంగోలులోనే చదువుతూ ప్రజానాట్య మండలి గాయకుడిగా ఎదిగిన శవందేమాతరం, ఇక్కడ అంటే ఒంగోలు లో విద్యార్థి ఉద్యమాల్లో కూడా పాల్గొన్నారని స్థానికుల వివరాల ను బట్టి తెలుస్తున్నది. శర్మ కళాశాలలో చదివే రోజుల్లో విద్యార్థి సంఘానికి అధ్యక్షుడిగా పని చేశారు. రెడ్‌ స్టార్‌ మాదాల రంగారావు, టి. కృష్ణ తదితరుల సహకారంతో గాయకుడిగా సినీరంగంలోకి అడుగుపెట్టిన ఆయన అనతికాలంలోనే ప్రజల మన్ననలు పొందారు. అటు సంగీత దర్శకుడిగా, గాయకుడిగా రాణించడమేకాక పలు చిత్రాల్లో నటించారు. తనను చేరదీసిన ‘అన్న’ పేరుతో రికార్డింగ్‌ థియేటర్‌ను కూడా ప్రారంభించారు. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయనతో పరిచయం ఏర్పడింది. టీడీపీ ఎన్నికల గేయాలను రూపొందించేవారు. గత ఎన్నికల్లో ఒంగోలు లోక్‌సభ నుంచి టీడీపీ తరఫున పోటీ చేయాలన్న ఆలోచన కూడా చేశారు. ప్రస్తుతం ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యవేక్షణలో టీడీపీ గేయాలు, నృత్య కార్యక్రమాల రూపకల్పనలోనూ తన వంతు పాత్ర పోషిస్తున్నారు.

తదనుగుణంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక అవకాశం ఇవ్వాలని భావించినట్లు తెలిసింది. ఒకదశలో శాసనమండలి పదవికి కూడా వందేమాతరం పేరును పరిశీలించారు. కానీ అది వివిధ కారణాలతో సాధ్యం కాలేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆయనకు సంగీత, నృత్య అకాడమీ చైర్మన్‌ పదవిని ఇవ్వాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. అయితే రేపోమాపో ఉత్తర్వులు వెలువడనున్నాయని పేర్కొంటున్నారు.

Please follow and like us:

You may also like...