Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

సర్పంచ్ ఏకగ్రీవం…

ఏకగ్రీవం కావడం తో ఎన్నికల సంఘం తో పాటు ఎమ్మెల్యే నిధులనుండి అక్షరాలా 25 లక్షల నిధులు గ్రామ పంచాయతీ కి రానున్నాయి.

ఈరోజుటీవి/యాదాద్రి భువనగిరి/కందిగడ్డ తాండ: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని నూతనంగా ఏర్పడ్డ కంద్దిగడ్డ తాండ గ్రామ పంచాయతీకి సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులను తాండ వాసులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇక అధికారిక ప్రకటనే తరువాయి.
గతంలో గుండ్లగూడెం గ్రామ పంచాయతీలో ఈ తాండ వుండేది. సుమారు 250 మంది ఓటర్లు 400 పై చిలుకు జనాభా కల్గి ఉన్నది. అయితే పాలన సౌలభ్యం దృష్టి ,తాండాలను గ్రామపంచాయతి లను చేయడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి దృష్టిలో వుంచుకొని ప్రభుత్వం ఏకగ్రీవాలను ప్రోత్సహించడం,10 లక్షల రూపాయలు ప్రకటించడంతో ఆ తాండ వాసులు అటువ్తెపు మొగ్గు చూపారు… రాజకీయలకు అతీతంగా పెద్దల సమక్షంలో సర్పంచ్, ఉప సర్పంచ్ తో పాటు మిగత 5 గురు వార్డు సభ్యులను ఎన్నుకున్నారు… పెద్దల సహకారంతో పాటు స్థానిక ఎమ్మెల్యే గొంగిడి సునితామహేందర్ రెడ్డి ఆశీస్సులతో తాండాను అభివృద్ధి చేస్తామని సర్పంచ్ ,ఉప సర్పంచ్ అభ్యర్థులు కేతావత్ సుజాత, ఎం. బోరిలాల్ నాయక్ లు మీడియాతో చెప్పారు… ఈ సందర్బంగా తాండాను ప్రత్యేక గ్రామ పంచాయతీగా చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు వారు కృతజ్ఞతలు తెలిపారు.

Please follow and like us:

You may also like...