Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్ హర్షణీయం

ఈరోజుటీవి/జగిత్యాల/టౌన్: జగిత్యాల జిల్లాలోని ఓసి జేఏసీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్ కల్పించడంపై హర్షం వ్యక్తం చేస్తూ మంగళవారం శ్రీలక్ష్మీ గణపతి ఆలయం జగిత్యాలలో ప్రత్యేక పూజలు, మరియు హోమం నిర్వహించారు. అలాగే స్వీట్లను పంపిణీ చేశారు. అనంతరం స్థానిక టవర్ సర్కిల్ వద్ద ఘనం గా సంబరాలు చేసుకున్నారు. ఈ నేపధ్యం లో వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూన్నామని అగ్రవర్ణాల కులాలకు పేదలకు 10% రిజర్వేషన్ల ను ప్రకటిస్తూ కేబినెట్ ఆమోదం తెలుపుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తూ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు సిరిసిల్ల శ్రీనివాస్, ఎన్నాం కిషన్, కమటాల శ్రీనివాస్, పాత్రికేయులు సిరిసిల్ల రాజేందర్ తదితరులు పాల్గొనగా, స్థానిక పట్టణం లోని వాణి నగర్ లో గల ధర్మశాలలో వాణి నగర్ ఆర్యవైశ్య సంక్షేమ సంఘం ఆద్వర్యం లో నరేంద్ర మోదీ అగ్రకుల పేదలకు 10% రిజర్వేషన్ల ను ప్రకటిస్తూ కేబినెట్ ఆమోదం తెలుపుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తూ మోదీ చిత్ర పటానికి పాలాభిషేకం, వైశ్య సోదరుల సంబరాలు, ఒకరికొకరు స్వీట్లు తినిపించుకుని వాణి నగర్ వైశ్య కుల సంఘ సభ్యులు ప్రధానమంత్రి నరేంద్రమోడీ కి కృతజ్ఞతలు తెలిపినారు.

Please follow and like us:

You may also like...