Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

65 కి చేరిన కొండగట్టు ప్రమాద మృతులు

హామీలు వట్టి నీటి మూటలైన వైనం… పూర్తి స్థాయిలో వైద్యం అందించని దౌర్భగ్యపు స్థితిలో  రాష్ట్ర సర్కార్… చివరికి మృత్యువొడిలోకి.

ఈరోజుటీవి/కొండగట్టు/క్రైమ్: దేశ వ్యాప్తంగా ఒకింత దిగ్భ్రాంతికి గురి చేసిన కొండగట్టు ఘటనలో తీవ్రంగా గాయపడి సెప్టెంబర్ 11 నుండి మృత్యువుతో పోరాడిన డబ్బుతిమ్మయ్య పల్లి గ్రామానికి చెందిన సురకంటి వనిత (35) బుధవారం మృత్యువు తో పోరాడి ఎట్టకేలకు మృతి చెందింది. వివరాల్లోకి వెళితే కొండగట్టు బస్సు ప్రమాద ఘటనలో  గాయపడిన వనిత హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన అనంతరం చికిత్స కోసం కరీంనగర్ ప్రతిమ ఆసుపత్రిలో చేరింది. వైద్యం చేసిన వనిత ఆరోగ్యం క్షీణీస్తోండగా ఆసుపత్రి వైద్యలు వైద్యం చేసేందుకు నిరాకరించడంతో రెండు నెలలుగా ఇంటి వద్దే వైద్యం  చేయించుకుంటున్న ఈ క్రమంలో ఇంటి దగ్గర చికిత్స పొందుతూ తుది శ్వాస వదిలింది. వనిత పుట్టినిల్లు జగిత్యాల మండలం మోతె కాగా మెట్టినిల్లు కొడిమ్యాల మండలం తిమ్మాయిపల్లి  బస్సు ప్రమాదంలో అక్కడికక్కడే, చికిత్స పొందుతూ మృతి చెందిన వారి సంఖ్య 65 కు చేరింది. వనిత మృతి విషయం వారి కుటుంబ సభ్యుల ద్వారా తెలుసుకున్న జగిత్యాల మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.

Please follow and like us:

You may also like...