Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

ఘనం గా జన్మభూమి మన ఊరు కార్యక్రమం

 

కర్నూలు జిల్లా,
మహానంది/తిమ్మాపురం,
ఈరోజు టీవీ న్యూస్: నిన్న జరిగిన 6 వ విడత జన్మభూమి-మా ఊరు కార్యక్రమం ఆదివారం నాడు మహానంది మండల కేంద్రం ఎం.తిమ్మాపురం గ్రామంలోని అంకాల పరమేశ్వరి దేవి ఆలయం దగ్గర మండల నోడల్ అధికారి బ్రహ్మం అధ్యక్షతన నిర్వహించారు.ముందుగా మండల విద్యాశాఖ అధికారి రామసుబ్బయ్య ముఖ్యమంత్రి గారి సందేశాన్ని చదివి వినిపించారు.
ఏ పి ఎం తిరుపాల్ రెడ్డి మాట్లాడుతూచంద్రన్న పెళ్లి కానుకలు, చంద్రన్న బీమా వల్ల కలిగే ప్రయోజనలను తెలియజేశారు. చంద్రన్న బీమా ఇద్దరు లబ్ధిదారులకు 4లక్షల నగదు అందజేశారు. డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నమని తెలిపారు. ఎన్టీఆర్ వైద్య సేవలు, ఎన్టీఆర్ హెల్త్ కార్డు ఉన్న వారుకి ఉచితంగా ఖరీదు అయిన వైద్య సేవలు అందిస్తున్నరని తెలిపారు. కొత్తగా నంద్యాల లోని ప్రభుత్వ ఆసుపత్రిలో కిడ్నీ బాధితులు కు ఉచితంగా డయాలసిస్ సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రతి నెల 9 వ తేదీనప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన పథకం లో భాగంగా తిమ్మాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో గర్భిణీ మహిళలు కు ఉచితంగా పౌష్టికాహారం, వైద్య పరీక్షలు ఉచితంగా అందిస్తున్న మన్నారు.తిమ్మాపురం గ్రామంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 155 డెలివరీలు చేసినట్లు తెలిపారు.అలాగే కస్తూరిబా విద్యార్థులు, మోడల్ స్కూల్ విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమలు ఆకట్టుకున్నాయి.ఉపాధి హామీ ఏ పీ ఓ మనోహర్ బాబు రాయలసీమ రతనాల సీమా అని పాడిన పాట ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో నోడల్ అధికారి బ్రహ్మం,మహానంది తహశీల్దార్ సుబ్బారాయుడు, ఎంపీడీఓ నరసింహులు,ఎంఇఓ రామ సుబ్బయ్య, ఏ పి ఎం.తిరుపాల్ రెడ్డి, ఈఓఆర్డీ మహబూబ్ ఖాన్,డాక్టర్ చంద్రశేఖర్,వ్యవసాయ అధికారులు సుబ్బారెడ్డి,బాల లింగమయ్యా, తిమ్మాపురం పంచాయతీ కార్యదర్శి షాబాన, గ్రామ రెవెన్యూ అధికారి వెంకటరమణ,తలారి కొండయ్య,జూనియర్ ఆస్టిడెంట్ మల్లికార్జున,ఎంపీడీఓ స్టాఫ్ ఫణీంద్ర, జాకీర్ హుస్సేన్ వివిధ శాఖల మండల అధికారులు,గ్రామ స్థాయి అధికారులు పాల్గొన్నారు.

Please follow and like us:

You may also like...