Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

జన్మభూమి మా ఊరు

ఈరోజుటీవి/కృష్ణ/పెనమలూరు: పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు మండలం పునాదిపాడు గ్రామంలో జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్బంగా వైద్య శిబిరాలు, వెటర్నరీ క్యాంపులను సందర్శించారు. అలాగే పుంగనూరు ఆవులు, జోడెద్దుల బండ్లు, కాంగ్రెజ్ జాతి ఎద్దులు (బాహుబలి ఎద్దులు), పొట్టేళ్లు, బ్యాటరీ వాహనాలను చంద్రబాబు పరిశీలించారు. పునాదిపాడులో మంచి వాతావరణం ఉందని, ఇక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్, వైద్య శిబిరాలు, వెటర్నరీ క్యాంపులు అన్ని బాగున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు కొనియాడారు. కృష్ణ జిల్లా కు ఎలక్ట్రికల్ వాహనాలు వచ్చాయని అన్నారు. ఇటీవల కియా మోటారు కారు చూశానని, అందులో ప్రయాణం చాలా బాగుందన్నారు. ఒకప్పుడు పుష్పక విమానాల గురించి చదివామని, అలాంటి పుష్పక విమానాలు మళ్లీ వస్తున్నాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఒక ఆఫీసులో కూర్చున్న విధంగా ప్రయాణం చేసే పరిస్థితి వస్తుందని, అలాంటి వాహనాలకు శ్రీకారం చుట్టామని చంద్రబాబు పేర్కొన్నారు.

రాష్ట్రంలో అన్ని వనరులు ఉన్నాయని, వాటిని ఏ విధంగా కాపాడుకోవాలోనని ఆలోచిస్తున్నామని విభజనతో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్టు ఉందని, అప్పటి ప్రధాని హామీ మేరకు తెలంగాణలో ముంపుకు గురవుతున్న ఏడు మండలాలు ఏపీకి ఇవ్వాలని, లేకపోతే పోలవరం ప్రాజెక్టుకు అడ్డంకులు వస్తాయని మోదీతో అన్నానని, ఆ ఏడు మండలాలు ఇస్తేనే ఏపీ సీఎంగా ప్రమాణం చేస్తానని, లేకపోతే చేయనని గట్టిగా చెప్పానని.. ఏడు మండలాలు ఇచ్చిన తర్వాతే ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశానని ఆ రోజు ఏడు మండలాలు రాకపోతే ఇవాళ పోలవరం కట్టేవాళ్లం కాదని ఆయన అన్నారు.

Please follow and like us:

You may also like...