Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

యూనిఫామ్ సర్వీసెస్ డెలివరీ వీడియో కాన్ఫరెన్స్ లో ఎస్పీ సింధు శర్మ

ఈరోజుటీవి/జగిత్యాల/క్రైమ్ : జిల్లా పోలీసు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర డి జి పి శ్రీ. ఎం మహేందర్ రెడ్డి వీడియో కాన్ఫరెన్సు లో పాల్గొన్న జిల్లా ఎస్ పి శ్రీ సింధు శర్మ ఐపీఎస్. ఈ సమావేశంలో జిల్లా ఎస్ పి తో పాటు అదనపు ఎస్పీ మురళీధర్, డీఎస్పీ లు సీతారాములు, వెంకటరమణ స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ లు రాజశేఖర్ రాజు, ఇన్స్పెక్టర్ లు మరియు ఎస్ ఐ లు పాల్గొన్నారు.

ఈ సమావేశంలో గౌరవ డిజిపి మాట్లాడుతూ ముందుగా రాష్ట్ర పోలీసు సిబ్బంది కి వారి కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. గడచిన సంవత్సరం నేర నివేదిక ప్రకారం క్రైమ్ రిపోర్ట్ 05% శాతం తగ్గింది ఇది గర్వించదగ్గ విషయం ఈ ఫలితం లో సమిష్టి కృషి ఉందని స్పష్టం చేసిన డీజీపీ ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేసినారు.
ఆస్తి సంబంధించిన నేరాలు, స్త్రీ లపై నేర శాతాన్ని తగ్గించడం పట్ల హర్షం వ్యక్తం వ్యక్తం చేస్తున్నాము.
అసెంబ్లీ ఎన్నిలకు 3 నెలలు ప్రత్యక్షంగా అందరూ తమ తమ బాధ్యత ను సక్రమంగా నెరవేర్చి శాంతియుత వాతావరణం లో ఎన్నికలు ముగిసేలా కృషి చేసిన ప్రతి ఒక్కరినీ అభినందిస్తున్నాము.
మన జీవితంలో జరిగిన ఒక సంఘటన ని ఒక అనుభవాన్ని విశ్లేషణ చేసుకొని దాని నుండి ఏమి నేర్చుకున్నారో తెలిసి యుండాలి. గత సంవత్సరం లో సాధించిన విజయాలు లోటు పాట్ల నుండి సమాధానాలు వెతుక్కోవాలి.
ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో 80% నేరాలు 20% ఏరియా లో జరుగును. అలాగే పోలీస్ స్టేషన్ పరిధిలో 80 % నేరాలు 20 % నేరస్తులు చేస్తుంటారు. అలాంటి విషయాలు పరిగణనలోకి తీసుకొని ఎక్కడ ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలాంటి చర్యల వల్ల ఎలాంటి ఫలితాలు పొందుతునన్నాము అనే విషయాలు సమన్వయం చేసుకంటూ నేర నియంత్రణ చేసుకోవాలి.
ఏదైనా ఒక పనిని ఒక ప్రణాళిక సమర్ధవంతంగా ప్రజలకు మేలు చేకూర్చేలా చేస్తే ఆ పోలీసు అధికారి ప్రజలలో ఒక స్మార్ట్ ఆఫీసర్ గా, ఒక రోల్ మోడల్ గా ఉంటారు.
ప్రతి ఒక్క పోలీసు అధికారి నాయకత్వ లక్షణాలు కలిగి యుండాలి.
డయల్ 100 రెస్పాన్స్ , ఇమెర్జెన్సీ రెస్పాన్స్ ల పట్ల అప్రమత్తంగా ఉండాలి, ఆపద సమయంలో సరైన సమయంలో చేరుకొని ప్రజలకు పోలీసు శాఖ పై భరోసా కలగజేయాలి.
తమ తమ కర్తవ్యాన్ని బాధ్యతాయుతంగా నెరవేర్చాలి.
ప్రపంచంలో ఏ దేశాలలో అభివృద్ధి అయిన అక్కడి శాంతి భద్రత పై ఆధారపడి ఉండును. 
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి దోహదం లో శాంతి భద్రత ల పాత్ర కీలకం.
ఒక అంకితభావంతో, ఒక లక్ష్యం, ఒక ప్రణాళిక, ఫీడ్ బ్యాక్ , టెక్నాలజీ తో గత సంవత్సరం గర్వించదగ్గ ఫలితాలు సాధించాము.
రోల్ క్లారిటీ – చేసే విధుల పై పూర్తీ అవగాహన కలిగి ఉండాలని, సమయస్ఫూర్తి తో క్రమశిక్షణ గ ఉంటూ వృత్తి నైపుణ్యం దిన దిన అభివృద్ధి సాధించాలని, సమయపాలన పాటిస్తూ, తమ కర్తవ్యాన్ని సంపూర్ణంగా నిర్వహిస్తూ శాంతి భద్రతా ల సంరక్షణ లో తమ విధిని భాద్యత గా పూర్తీ చేయాలి.
ప్రతి అధికారి ఈ ప్రశ్నలు గుర్తుంచుకోవాలి..
  ఎం చేయాలి 
 ఎలా చేయాలి
 ఎందుకు చేయాలి
 నీవేమి నేర్చుకున్నావు
ఒక సంఘటన స్థలంలో ఒక కానిస్టేబుల్ కావచ్చు, లేదా ఇన్స్పెక్టర్ కావచ్చు అక్కడి సంఘటన ని అదుపులోకి తీసుకరవడానికి అతను ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఆ సమస్యని అధిగమించడానికి ఏ విధంగా ముందుకెళ్లాడు, లక్ష్య సాధన లో అతని పాత్ర ఏంటి అని తెలిపేదే నాయకత్వ లక్షణము.
మన రాష్ట్రం అంత కూడా ఒకసిటిజన్ ఒక సమస్య తో రాష్టం లో ఏ పోలీస్ స్టేషన్ కి వెళ్లిన అక్కడి పోలీసు సిబ్బంది ఎవరున్న, ఏ సమయాల్లో వెళ్లిన ఒకే విధమైమ స్పందన రావాలి. . ..
పిర్యాడిదారుని పట్ల సాదర అహ్వనం, మాట్లాడే విధానం, వివరాలు తెలుసుకోవడం, అతని సమస్యని అర్థం చేసుకోవడం, అతను సమస్య కి మన స్పందన, అతని సమస్య పరిష్కార పద్ధతి ఒకేలా ఉండాలి.
ఈ పెట్టి కేసు, ఈ చాలన్, ఎన్ఫోర్స్మెంట్ లాంటి పెట్టి కేసుల ద్వారా చిన్న చిన్న నేరాలను అరికట్టేందుకు వీలు అవును తద్వారా పెద్ద నేరాలు కూడా అదుపులోకి వస్తాయి. మనం చిన్న చిన్న నేరాలు అరికట్టితే పెద్ద నేరాలు కూడా నిరోధించిన వారిమి అవుతాము.
ప్రతి జిల్లాలో ఉత్తమ ప్రతిభ చూపిన పోలీసు లకి “కీ” పెర్ఫార్మన్స్ ఇండికేట్ అవార్డులు అందజేస్తూ వారిని ప్రోత్సహిస్తూ ఉండాలి.
సమాచార సాంకేతికత వినియోగం, ఇంఫార్మషన్ టెక్నాలజీ పై పోలీసు అధికారులు అందరికి సరైన అవగాహన కలిగియుండాలి. సాంకేతికతను విరివిగా అన్ని విభాగాలలో వినియోగంలోకి తీసుకరావాలి. ఆధునికి సాంకేతిక యుగంలో వేగానికి తగిన విధంగా ముందుకెళ్తూ ప్రజా సంక్షేమం శాంతి భద్రతల రక్షణ లక్ష్యంగా అందరూ సమిష్టి గా కృషి చేయాలి” అని తెలిపారు.

Please follow and like us:

You may also like...