Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

షీ టీం పై అవగాహన

ఈరోజుటీవి/జగిత్యాల/ధరూరు క్యాంపు : ఈ రోజు ధరూర్ క్యాంపు లోని గవర్నమెంట్ స్కూల్లో షీ టీమ్ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఇందులో ఏఎస్సై వలి బేగ్ మాట్లాడుతూ ఆడవారి కోసమే షీ టీమ్స్ ఉన్నాయని, ఆడవారికి, అమ్మాయిలకు ఎలాంటి ఆపద వచ్చిన,వారి పట్ల ఆకతాయిలు అసభ్యకరంగా ప్రవర్తించిన, సైగలు చే సిన, నిర్భయంగా షీ టీమ్ వారికి తెలియజేయ వచ్చని, వారి వివరాలు గోప్యంగా ఉంచబడుతాయని చెప్పడం జరిగింది. విద్యార్థులు ఒక్క లక్ష్యాన్ని ఏర్పరుచుకున్నట్లయితే చెడు అలవాట్లు అలవాటు కావని, చిన్న వయసులో పెళ్ళిళ్ళు చేసుకోవద్దని, బాగా చదువుకుని ఉన్నతంగా ఎదగాలని, మన తల్లిదండ్రులు మన గురించి ఎన్నో కలలు కంటారని, వాళ్ళ ఆశలు నీళ్ల పాలు చేయొద్దని, మేము కేసులు పెడితే జీవితం నాశనం ఐతదని సూచించడం జరిగింది. షీ టీమ్ ఫోన్ నంబర్స్ ఇవ్వడం జరిగింది.ఇట్టి కార్యక్రమంలో స్కూల్ ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ నర్సయ్య , స్టాఫ్, షీ టీమ్ సభ్యులు ,ఏఎస్సై లక్ష్మీనారాయణ , సుమన్, సరస్వతి, మధు, కేశవ్, పద్మ, తదితరులు పాల్గొన్నారు.

Please follow and like us:

You may also like...