Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

ఎడారి దేశం లో ఆదుకున్న గల్ఫ్ సమితి…!

గల్ఫ్ బాటలో అనారోగ్యం పాలు… దిక్కు తోచని స్థితిలో అక్కున చేర్చుకుని తెలంగాణ కార్మికుడికి అండగా తెలంగాణ గల్ఫ్ సమితి ఖతార్ శాఖ.. ఆపన్న హస్తం అందించి మాతృదేశానికి అన్ని తామైన వైనం…

ఈరోజుటీవి/గల్ఫ్ బ్యూరో/యాగండ్ల రమేష్ గౌడ్: తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం మన్నెగూడం గ్రామానికి చెందిన అరుణ్ అనే యువకుడు గత 7 నెలల క్రితం ఖతార్ కు చెందిన ఒక కంపెనీలో పనిచేయడానికి చేరాడు. ఇది ఇలాగ ఉండగా ఉన్న ఊర్లో సరైన ఉపాధి దొరకక కన్నతల్లిదండ్రులను, ఉన్న ఊరిని వదిలి ఎడారి బాటలో కాసుల వేటలో పయనం చేస్తున్న ఆ యువకార్మికుడికి అనుకోకుండా నొప్పి రావడం తో హాస్పిటల్ కి వెళితే, వైద్యులు నిర్వహించిన పరీక్షల అనంతరం వారు తనకు కిడ్నీ లో రాళ్లు ఏర్పడినాయని, ఇంకోసారి నొప్పి వస్తే ఆపరేషన్ చెయ్యాల్సి వస్తుందని డాక్టర్లు అనడంతో, దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్న ఆ యువకుడికి కంపనీ వారు పాస్పోర్ట్ తమ దగ్గర పెట్టుకొని కాంట్రాక్ట్ పూర్తి కాలేదంటూ, నీవు వెళ్లారాదని అనడంతో అయోమయ స్థితిలో ఉన్న ఆ యువకుడికి శ్రావణ్ వెల్మల భరోసా ఇచ్చి ఆ యువకుడిని తీసుకెళ్లి తెలంగాణ గల్ఫ్ సమితి ని ఆశ్రయించాడు. శ్రవణ్ చెప్పిన వివరాలను విన్న గల్ఫ్ సమితి బృందం ఆ యువకుడిని భారత రాయబార కార్యాలయం ఎంబసికి తీసుకువెళ్లి, వారితో చర్చించి అటు పిమ్మట కంపనీ వారితో మాట్లాడించి పాస్పోర్ట్ ఇప్పించడము జరిగిందని పేర్కొన్నారు. కార్మికుల సమస్యల్లో ఎల్లప్పుడూ తన వంతు సహాయం చేసే ప్రేమ్ బొడ్డు బాధితునికి ఉచితంగా టిక్కెట్ ఇవ్వడానికి ముందుకు వచ్చి సాయం చేశారని ఈ సందర్బంగా తెలిపారు. ఈ నేపధ్యం లో ప్రేమ్ కు గల్ఫ్ సమితి సభ్యులు ధన్యవాదాలు తెలిపినారు. వీరందరూ ఉన్న ఊరు వదిలి ఎడారిబాటలో కాసుల వేటలో తమ రక్తం ను చెమట ను చిందిస్తూ సంపాదించిన దానిలో ఎవరికి తోచినంత వారు కష్టాల్లో ఉన్నవారికి అండగా ఉంటూ ఆపన్న హస్తం అందించడం తో ఎందరో అభాగ్యులు ఎడారి దేశం నుండి మాతృ భూమికి చేరుతున్న లెక్కలేని సందర్భాలెన్నోఅని ఈ సందర్బంగా సమితి సభ్యులు గుర్తు చేశారు. మొత్తానికి ఎన్నో వ్యయప్రయాసాల తరువాత ఆ యువకుడు ఈ రోజు తిరిగి ఇండియా కి పంపుతున్నారని మా గల్ఫ్ ప్రతినిధి యాగండ్ల రమేష్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం తెలుస్తున్నది….
ఈ విషయం లో ప్రత్యేక చొరవ చూపి ఎంబసీ మరియు కంపెనీ యాజమాన్యం తో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేసిన తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షుడు శంకర్ సుందరగిరికి మరియు సహాయ సహకారాలందించిన శ్రీధర్ కు, శ్రవణ్ వెల్మల కు ఇంకా గల్ఫ సమితి బృంద సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Please follow and like us:

You may also like...