Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

ప్రగతి భవన్ లో కేటీఆర్ సమావేశం

కార్యకర్తలకు, నాయకులకు దిశానిర్దేశం తో పాటు ఆత్మస్థైర్యాన్ని నింపే ప్రయత్నం…

ఈరోజుటీవి/హైదరాబాదు/ప్రగతిభవన్: తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ రోజు ప్రగతి భవన్ లో హుజూర్ నగర్, చొప్పదండి నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ హుజూర్ నగర్ లో స్థానిక నాయకత్వం కొంత సమిష్టిగా కలిసి పని చేయడం లో స్థానిక నాయకత్వ లోపాల వల్ల మనం స్వల్ప మెజారిటీ తో ఓడిపోవడం జరిగింది. కానీ మనం అధైర్య పడొద్దని కార్యకర్తల్లో, నాయకులకు మనస్థైర్యం నింపే ప్రయత్నం చేశారు. ఈ నేపధ్యం లో మాట్లాడుతూ ఆయన గతం లో మొదటి సారి కేసీఆర్ 80 లో ఓటమి పాలైనప్పటికీ తరువాత జరిగిన ఎన్నికల్లో ఓడిపోవడం జరుగలేదని ఆయన గుర్తు చేసినారు. అలాగే ఓడిపోయినప్పటికీ ప్రజాక్షేత్రం లో ప్రజలతో మమేకం అయ్యే వారిని ప్రజలు తప్పకుండ గుర్తిస్తారని ఆయన పేర్కొన్నారు. అలాగే ప్రస్తుతం హుజూర్ నగర్ నుండి ఎమ్మెల్యే గా ఉత్తమ్ కుమార్ రెడ్డి మరోసారి గెలిచారని అని అన్న ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఎంత అహకారమో నాకు బాగా తెలుసు అని గుర్తు చేసినారు. గతం లో నేను జగదీశ్వర్ రెడ్డి మంత్రి గా ఉన్నామని ఉత్తమ్ శాసన సభ సభ్యుడిగా ఉన్నారు. కానీ ఒక్కటంటే ఒక్కసారి జగదీశ్వర్ రెడ్డి నేతృత్వంలో జిల్లా పరిషత్ సమావేశం జరిగితే కాంగ్రేస్ పార్టీ సీనియర్ నాయకులు ఎమ్మెల్యేలు గా ఉన్న జానా రెడ్డి రాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి రాడు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రాడు వాళ్ళ ఫీలింగ్ ఏందంటే మేము చాలా గొప్పోళ్ళమని గీళ్ళు మంత్రి పదవులు వెలగబెడుతుంటే మేము వాటికి పోవాల్నాఅనే అహంకారం అని విమర్శించారు. ఇంకా కేటీఆర్ ఏమని అన్నారో క్రింది వీడియో క్లిక్ చేసి చూడండి.

Please follow and like us:

You may also like...