Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

భాషాపండితులకు సమానపనికి సమాన వేతనం అంధించాలి

ఆర్.యు.పి.పి.టి. జిల్లా ప్రధాన కార్యదర్శి వేల్పుల స్వామి యాదవ్ వినతి పత్రం…

RUPP-T JAGTIAL జిల్లా శాఖ పక్షాణ వినతి పత్రం సమర్పిస్తున్న పండిత పరిషత్ జిల్లా ప్రధాన కార్యదర్శి వేల్పుల స్వామి యాదవ్

ఈరోజుటీవి/రాయికల్/టౌన్: రాష్ట్రంలోని తెలుగు, హింది, ఉర్దూ భాషలు బోధిస్తున్న భాషాపండితులు ఉమ్మడి రాష్ట్రం నుండి దశాబ్దాల కాలంగా శ్రమదోపిడి, వెట్టిచాకిరికి గురౌతున్నారని కావున భాషాపండితులకు సమానపనికి సమాన వేతనం సమాన గౌరవం కల్పించి వెట్టిచాకిరి శ్రమదోపిడి నుండి విముక్తి కల్పించాలని, విద్యాహక్కు చట్టం పూర్తిగా అమలు చేసి ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలో గ్రేడ్-2 భాష పండిత పోస్టులను రద్దు చేసి స్కూల్ అసిస్టెంట్స్ చే బోధన చేపించాలని కోరారు.
నేడు జిల్లా విద్యాధికారి యస్.వెంకటేశ్వర్లకు పండిత పరిషత్ పక్షాణ ప్రాతినిధ్యం సమర్పించారు. అలాగే ప్రాథమిక స్థాయిలో హిందీని ప్రవేశ పెట్టి తెలుగు హిందీ పండితులను నియమించాలని, భాషపండితుల ఆత్మగౌరవ సమస్యలు పరిష్కరించాలని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భాషాపండిత పోస్టులన్నింటిని అప్ గ్రేడ్ చేస్తూ గ్రేడ్-2 వ్యవస్థ రద్దుచేసిన విధంగా మన రాష్ట్రంలో పండిత పోస్టులన్నింటిని అప్ గ్రేడ్ చేయాలని, 17, 18 జీవోలు అమలు పరుస్తూ పండితులకు వెంటనే పదోన్నతులు కల్పించాలని వినతి పత్రంలో కోరడంతో ఇట్టి సమస్యల పరిష్కారానికై రాష్ట్ర విద్యాశాఖ దృష్టికి తీసుకపోతానని అన్నారు. ఈ సందర్భంగా డి.ఈ.వో. కు సంఘ పక్షాణ కృతజ్ఞతలు తెలుపనైనది.

Please follow and like us:

You may also like...