Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

మున్నూరుకాపు కాలెండర్ ఆవిష్కణలో ఎమ్మెల్యే : డా. సంజయ్

ఈరోజుటీవి/జగిత్యాల/బ్యూరో :  హనుమాన్ వాడ బి.యల్ మినీ ఫంక్షన్ హాల్ లో జగిత్యాల పట్టణ మున్నూరు కాపు సంఘం కాలమనిని ఆవిష్కరించిన జగిత్యాల శాసన సభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్.
సంజయ్ మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్  వ్యవసాయం పై అమితమైన ఇష్టం తో ఒక కాపు లాగా రైతు బాగుపడాలంటే రెండవసారి కాళేశ్వరం ప్రాజెక్ట్ సందర్శన చేపట్టారని తెలిపారు.
మున్నూరు కాపులు రాజకీయంగా,వ్యాపారపరంగా ఉన్న కూడా ముఖ్యంగా వ్యవసాయం పై ఆధారపడి జీవిస్తారని, సీఎం కేసీఆర్  కూడా మున్నూరు కాపు సామాజిక వర్గానికి సముచిత ప్రాధాన్యం కల్పిస్తున్నారని తెలిపారు.
గతం లో ఏదైనా సహాయం పొందాలంటే దళారుల ప్రమేయం ఉండేదని కానీ దళారుల ప్రమేయం లేకుండా ఇప్పుడు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా రైతు బంధు కోసం 12 వేల కోట్ల రూపాయలు.
రైతు బంధు ద్వారా ఎకరానికి 8 వేలు అందజేస్తున్నామని,ఎవరైనా రైతుమరణిస్తే ఉచిత రైతు బీమా ద్వారా 5 లక్షలు అందిస్తున్నామని తెలిపారు.
రైతుబందును ఐక్యరాజ్యసమితి గుర్తించిందని, కేంద్రం మరియు ఇతర రాష్ట్రాలు కూడా అమలు చేయడానికి కృషి చేస్తున్నారు అని తెలిపారు.
బీరుపూర్, సారంగపూర్ మండలం లో 11 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోడౌన్ ల నిర్మాణం, రాయికల్, జగిత్యాల లో కూడా గోడౌన్ ల నిర్మాణం చేపట్టడం జరిగిందని తెలిపారు. ఎస్సారెస్పీ ని చెరువులకు అనుసంధానం చేయడం, ప్రతి ఎకరానికి నీళ్లు వచ్చే విధంగా కృషి చేస్తానని తెలిపారు.
గతం
మున్నూరు కాపు సంఘ భవనాలకు తిప్పన్నపేట్, బీట్ బజార్, కొత్త వాడ సంఘాలకు నిధుల మంజూరు చేశామన్నారు. శ్మశానవాటిక మరియు పోచమ్మగుడి, హనుమాన్ గుడికి నిధుల మంజూరు మరియు 2 మున్నూరు కాపు సంఘాలకు 15 లక్షల చొప్పున మంజూరు.
3.5 కోట్లతో ఎస్.కె.ఎన్.ఆర్ డిగ్రీ కాలేజ్ నుండి జామామస్జిద్ వరకు బి టి రోడ్ నిర్మాణం చేపట్టడం జరిగిందని,2 కోట్లతో ఖిల లో టూరిజమ్, 4.25 కోట్లతో మామిడి మార్కెట్ అభివృద్ధి, 2.5 కోట్ల తో విధి దీపాలు, 11 కోట్ల తో మురికి కాలువలు , 4వేల 2 బెడ్ రూంల ఇళ్ల నిర్మాణం చేపట్టడం జరుగుతుందని తెలిపారు. జగిత్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పెర్సన్ శీలం ప్రియాంక ప్రవీణ్, జగిత్యాల పట్టణ మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు రంగు గోపాల్, బాధినేని రాజేందర్, బండారు నరేందర్, ఏనుగుల భూమయ్య, బండారు రాజ్ కుమార్ పొద్దుపొడుపు న్యూస్ ఛైర్మెన్, అడపా గంగారాం, కుసరి అనిల్ న్యూస్ 9స్టాఫ్ రిపోర్టర్, చిట్ల రవీందర్, పుప్పాల అశోక్, కూతురు రాజేష్, కూతురు శేఖర్, జగిత్యాల జిల్లా, పట్టణ తెరాస యూత్ అధ్యక్షులు దవా సురేష్, కత్రోజ్ గిరి తెరాస విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు ఠాకూర్ ప్రబాత్ సింగ్ తదితరులుపాల్గొన్నారు.

Please follow and like us:

You may also like...