Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

మంత్రివర్గ విస్తరణకు పంచాయతీ ఎన్నికల కోడ్ అడ్డం కాదు

హైదరాబాద్: మంత్రివర్గ విస్తరణకు పంచాయతీ ఎన్నికల కోడ్ అడ్డం కాదని తెలంగాణ ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. దీంతో ఫిబ్రవరిలోనే జరుగుతుందనుకున్న విస్తరణ మళ్లీ ఈనెలలో జరగవచ్చుననే ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో మంత్రి వర్గ విస్తరణ ఎప్పుడనే దానిపై రోజుకోక తీరుగా ప్రచారం జరుగుతోంది. ఒకసారి సంక్రాంతి తర్వాత అని, మరోసారి కోడ్ కారణంగా ఫిబ్రవరిలో అనే లీకులు సీఎం సన్నిహిత వర్గాల నుంచి మీడియాకు అందుతున్నాయి.

మంత్రివర్గ విస్తరణపై ఎమ్మెల్యేలు గంపెడాశలు పెట్టుకున్నారు. ఫలితాలు వచ్చి 20 రోజులు దాటింది. కేసీఆర్ ఢిల్లీ పర్యటన తర్వాత విస్తరణ ఉంటుందని భావించారు. కానీ మంచిరోజులు లేవన్న కారణంతో విస్తరణ వాయిదా వేసుకున్నారు. సంక్రాంతి తర్వాత అసెంబ్లీలో ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం.. ఆ వెంటనే విస్తరణ ఉంటుందని సంకేతాలు ఇచ్చారు. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ రావడంతో జనవరి 30 వరకు కోడ్ అమలులో ఉంటుంది. ఎన్నికల కోడ్ కారణంగా పంచాయతీ ఎన్నికలు ముగిసేవరకు కేబినెట్ విస్తరణ ఉండదనే వార్తలు బయటకు వచ్చాయి. అయితే ప్రభుత్వ వర్గాలు మాత్రం కోడ్‌కు, విస్తరణకు సంబంధం లేదని తేల్చాయి.

Please follow and like us:

You may also like...