Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

గోదావరి నీరు భారీగా లీకేజీ..ఇక హైదరాబాద్‌కు నేడు, రేపు నీటి సరఫరా బంద్‌

దాచిన చిత్రం 

ఈరోజుటీవి/హైదరాబాద్‌: నగరంలోని పలు ప్రాంతాలకు శుక్ర, శనివారం నీటి సరఫరా ఉండదని వాటర్‌బోర్డు అధికారులు వెల్లడించారు. మల్లారం-బొమ్మకల్‌ మధ్యలోని తోటపల్లి వద్ద గోదావరి నీరు భారీగా లీకేజీ అవుతుండడంతో పైపులైను మరమ్మతు పనులు చేపడుతున్నారు. శుక్రవారం ఉదయం ఐదు గంటల నుంచి శనివారం సాయంత్రం 6 గంటల వరకు గోదావరి నీటిని నగరానికి బంద్‌ చేస్తున్నారు. రెండు రోజుల పాటు ఎర్రగడ్డ, ఎస్‌ఆర్‌నగర్‌, వెంగల్‌రావునగర్‌, ఎల్లారెడ్డిగూడ, యూసు్‌ఫగూడ, రెహ్మత్‌నగర్‌, శ్రీరాంనగర్‌, బంజారాహిల్స్‌, బోరబండ, ఎస్‌పీఆర్‌ హిల్స్‌, అల్లాపూర్‌, రాధిక సెక్షన్స్‌, ఢిఫెన్స్‌ కాలనీ, చాణిక్యపురి, మల్కాజిగిరి మున్సిపాలిటీలోని గౌతమీనగర్‌ సెక్షన్‌, అల్వాల్‌, ఫాదర్‌ బాలయ్యనగర్‌, యాప్రాల్‌ సెక్షన్‌, అల్వాల్‌ మున్సిపాలిటీ, చింతల్‌, షాపూర్‌నగర్‌, జీడిమెట్ల, జగద్గిరిగుట్ట, కుత్బుల్లాపూర్‌ మున్సిపాలిటీ ప్రాంతాలు, ఎంఈఎస్‌ గన్‌రాక్‌, త్రిశూల్‌ లైన్స్‌, రుద్రనగర్‌, భాగ్యనగర్‌ సెక్షన్‌ ఏరియా ఆల్విన్‌ కాలనీ, హస్మత్‌పేటలోని కొన్ని ప్రాంతాలకు నీటి సరఫరా ఉండదని అధికారులు వెల్లడించారు.

Please follow and like us:

You may also like...