Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

రూ. 2 వేల నోటుపై కేంద్రం సంచలన నిర్ణయం

ఈరోజుటీవి/న్యూ ఢిల్లీ/ బ్యూరో చీఫ్: పెద్ద నోట్ల రద్దు తరువాత కేంద్రం ప్రవేశ పెట్టిన రూ. 2 వేల నోటును ఉపసంహరించుకోబోతున్నారంటూ గత కొద్ది కాలంగా హల్ చల్ చేస్తున్న వార్తలకు ఇప్పుడు కేంద్రం ఊతం ఇస్తున్నట్లుగా ఆ దిశలో మరింత బలం చేకూర్చుతున్నట్లు గా వ్యవహరిస్తోంది. రూ 2 వేల నోట్ల వాళ్ళ మనీలాండరింగ్ కేసులు పెరుగుత్న్నట్లు గ్రహించిన కేంద్రం నోట్ల ముద్రణను నిలిపివేయాల్సిందిగా భారతీయ రిజర్వు బ్యాన్కు (ఆర్బీఐ) ను ఆదేశించినట్లు తెలుస్తోంది. 2016 నవంబరు చివర్లో ఈ నోట్లను ప్రభుత్వం చలామణి లోకి తీసుకొచ్చింది. ఎప్పుడు సరిగ్గా రెండేళ్ల తరువాత ఈ నిర్ణయం తీసుకున్నది.

ఇది ఇలాగ ఉండగా ముద్రణ ను నిలిపివేసిన నోట్లు చలామణీలోనే ఉంటాయని ఆర్బీఐ సపష్టం చేస్తోంది. రూ. 2 వేల నోట్లను వెనక్కి తీసుకోబోతున్నట్లు వస్తున్నా వార్తలను ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు ఖండించడం జరిగింది. ఈ నేపధ్యం లో మరి ఓ అడుగు ముందుకేసి అటువంటిదేమి లేదంటూ లోక్ సభలో ఆర్ధిక శాఖా మాత్యులు అరుణ్ జైట్లీ పలుమార్లు స్పష్టం చేశారు. అయితే ఈ సందర్బంగా తాజాగా వాటి ముద్రణ ను నిలిపివేస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించడం తో ఒక్కసారిగా కలకలం రేగింది. నోట్ల ముద్రణను నిలిపివేస్తున్నట్లు తెలిపిన ఆర్బీఐ నోట్లు మాత్రం చలామణిలో ఉంటాయని, ఈ విషయం లో అనవసర భయాందోళనలు అవసరం లేదని ఈ సందర్బంగా స్పష్టం చేసింది.

Please follow and like us:

You may also like...