Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

భక్తులే ఆ మహిళలకు అండగా నిలిచారు: కేరళ సీఎం

తిరువనంతపురం: నిన్న శబరిమల ఆలయంలోకి ప్రవేశించిన ఇద్దరు మహిళలకు భక్తుల నుంచి ఎలాంటి వ్యతిరేకత వ్యక్తం కాలేదని కేరళ సీఎం పినరయి విజయన్ పేర్కొన్నారు. ‘‘భక్తులు స్వయంగా ఆ ఇద్దరు మహిళలకు సాయం చేశారు…’’ అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్లకు బీజేపీ, ఆరెస్సెస్‌లే కారణమని ఆరోపించారు. తరుణ వయసు మహిళ ప్రవేశంపై వందల ఏళ్ల నుంచి కొనసాగుతున్న నిషేధాన్ని ధిక్కరిస్తూ నిన్న ఇద్దరు మహిళలు శబరిమల ఆలయాన్ని దర్శించుకున్న సంగతి తెలిసిందే. వీరికి పోలీసులు, కేరళ ప్రభుత్వం సహకరించడంపై కేరళ వ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటుతున్నాయి. శబరిమల కర్మ సమితి సహా పలు హిందూత్వ సంస్థలు ఇవాళ కేరళలో చేపట్టిన బంద్ హింసాత్మకంగా మారింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్పందిస్తూ…

‘‘హింసకు వ్యతిరేకంగా ఆ మహిళలు వ్యూహాత్మకంగా, ప్రణాళికాబద్దంగా వ్యవహరించారు. భక్తుల సహకారంతోనే సురక్షితంగా లోపలికి వెళ్లి తిరిగి వచ్చారు. మహిళలకు భద్రత కల్పించడం ప్రభుత్వం బాధ్యత. రాజ్యాంగపరమైన బాధ్యతను ప్రభుత్వం నెరవేర్చింది. శబరిమలను ఘర్షణలు సృష్టించేందుకు సంఘ్ పరివార్ ప్రయత్నిస్తోంది. దీన్ని కఠినంగా అడ్డుకోవడం తప్ప ప్రభుత్వానికి మరో మార్గం లేదు..’’ అని పేర్కొన్నారు. సంఘ్‌పరివార్ సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరిస్తోందనీ.. నిజమైన భక్తులెవరూ సుప్రీంకోర్టు ఆదేశాలను వ్యతిరేకించడం లేదని సీఎం అన్నారు.

కాగా నిన్న పందాళంలో జరిగిన అల్లర్లలో శబరిమల కర్మ సమితి కార్యకర్త చంద్రన్ ఉన్నతన్ తీవ్రంగా గాయపడ్డాడని ముఖ్యమంత్రి తెలిపారు. ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినప్పటికీ… గుండెపోటు కారణంగా ఆయన మృతిచెందాడని వెల్లడించారు. ఆందోళన కారులు ఇప్పటి వరకు 7 పోలీసు వాహనాలు, 79 ఆర్టీసీ బస్సులను ద్వంసం చేశారని వెల్లడించారు. కాగా 39 మంది పోలీసులపై దాడి జరిగినట్టు ప్రభుత్వం వెల్లడించింది. ప్రత్యేకించి మహిళలు, మహిళా జర్నలిస్టులపై ఆందోళనకారులు దాడులకు పాల్పడుతున్నారనీ.. ఇలాంటి చర్యలను సహించేది లేదని ముఖ్యమంత్రి విజయన్ ఘాటుగా హెచ్చరించారు.

Please follow and like us:

You may also like...