Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

ఆరోగ్య శాఖ జిల్లా స్థాయి వర్క్ షాప్

ఈరోజుటీవి/జగిత్యాల/టౌన్: ఈ రోజు నేషనల్ ఇమ్యునైజేషన్ డే సందర్భంగా ఐఎంఏ హాల్ లో గురువారం జగిత్యాల జిల్లా వైద్యాధికారి డాక్టర్ పి శ్రీధర్ అధ్యక్షతన జిల్లాస్థాయి వైద్యాధికారులకు, సూపర్వైజర్లకు వర్క్ షాప్ నిర్వహించడం జరిగింది. ఈ వర్క్ షాప్ కు ముఖ్య అతిథిగా డబ్ల్యుహెచ్ఓ సర్వే లెన్స్ మెడికల్ అధికారి డాక్టర్ అబ్దుల్ నిగం హాజరైనారు. కార్యక్రమంలో భాగంగా మాట్లాడుతూ జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని సమగ్రంగా చేపట్టింది. అయితే  విజయవంతం చేసే దిశగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ పి శ్రీధర్ తెలియజేసినారు. అందుకుగాను పల్స్ పోలియో యాక్షన్ ప్లాన్ తయారు చేసి బూతులు ఫ్రాన్సిస్ పాయింట్ పాయింట్లతో మొబైల్ టీమ్లను ఏర్పాటు చేసి ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. నేషనల్ ఇమ్యునైజేషన్ డే ఈ అంశంపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీధర్ జిల్లా స్థాయి వర్క్ షాప్ నిర్వహించడం జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమంలో జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రము వైద్యాధికారులు సూపర్వైజర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పలు సూచనలు చేశారు. అనంతరం సర్వే లెన్స్ మెడికల్ అధికారి డాక్టర్ నిగామి మాట్లాడుతూ 3వ పిబ్రవరి 2019 నుంచి ప్రారంభమయ్యే పల్స్ పోలియో కార్యక్రమంలో జీరో 0-5 ఏళ్ల పిల్లలకు పోలియో చుక్కలను వేస్తామని తెలియజేసినారు. అలాగే 4 ,5 తేదీలలో సభ్యులు ఇంటింటికి వెళ్లి చుక్కలు వేస్తారని సూచించారు. ఎల్పీపిఐ ఆక్షన్ ప్లాన్ను తయారు చేసే విధానాన్ని సూచించారు. ఏరియాలోని జీరో టు 5 ఏళ్లలోపు పిల్లలను గుర్తించి ఎలా వేయాలి రిపోర్ట్ ఫాన్స్ యాక్షన్ ప్లాన్ అంశాలపై శిక్షణ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ ఎన్.శ్రీనివాస్, డిప్యూటి డిఎంహెచ్ఓ డాక్టర్ ఎం జైపాల్ రెడ్డి , ప్రోగ్రామ్ ఆఫీసర్ కంటి వెలుగు డాక్టర్ శమీ ఉద్దీన్ జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ని మెడికల్ ఆఫీసర్లు మరియు సూపర్వైజర్లు హెచ్ఈవో ఏ రాజేశం హెచ్ ఈ వెంకటరమణ తదితరులు ఉన్నారు.

Please follow and like us:

You may also like...