Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు

కోరుట్ల పట్టణం లో జ్యోతిరావు పూలే,సావిత్రిబాయి పూలే విగ్రహాలను  ఏర్పాటు చేయాలన్న ఎస్ఎఫ్ఐ జిల్లా శాఖ..తహిసీల్దార్ కు వినతి పత్రం.

సామాజిక సంస్కరణోధ్యకారుడు జ్యోతిరావు పూలే, సామాజిక విప్లవకారిణి, భారతదేశపు తోలి మహిళ ఉపాధ్యాయురాలు సావిత్రి బాయి పూలే విగ్రహాలను కోరుట్ల పట్టణంలో ఏర్పాటు చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు సుజాయిత్ అలీ పేర్కొన్నారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సావిత్రబాయి పూలే జయంతి వేడుకలను కోరుట్ల పట్టణం లో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా తన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కోరుట్ల పట్టణంలో సావిత్రిబాయి పూలే, జ్యోతిరావు పూలే విగ్రహాలను ఏర్పాటు చేయాలని కోరుతూ తహసిల్దార్ చింతల కొమ్మల రెడ్డికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు ఎండీ.సుజాయిత్ అలీ మాట్లాడుతూ భారత దేశంలో మొదటి మహిళా ఉపాధ్యాయురాలు, మహిళలకు మొదటి పాఠశాల స్ధాపించిన సంఘ సంస్కర్త సావిత్రీబాయి పూలే అని అన్నారు. అట్టడుగు వర్గాలు మహిళలకు చదువు, సంపద వంటి సమస్త హక్కులు నిరాకరింపబడిన దేశంలో ఆనాటి సమాజపు కట్టుబాట్లను, మనువాద సంప్రదాయాలను, ఆధిపత్యవర్గాలను ధిక్కరించి భారతదేశపు మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా పాఠశాలలు ప్రారంభించరు. 12 మే 1848న దేశంలో బహుజనులకు మెుట్టమెుదటి పాఠశాల ప్రారంభించిన సంస్కర్త సావిత్రిబాయి ఫూలే. ఈమె భారతీయ సంఘ సంస్కర్త, ఉపాధ్యాయిని మరియు రచయిత్రి. ఆధునిక విద్య ద్వారానే స్ర్తీ విముక్తి సాధ్యపడుతుందని నమ్మి భర్తతో 1848 జనవరి 1న పూణేలో మొట్టమొదటగా బాలికల పాఠశాలను ప్రారంభించింది. కుల వ్యవస్థకు వ్యతిరేకంగా నడుము బిగించిన మొట్టమొదటి మహిళ సావిత్రి బాపు పూలే అని ఘనతను కొనియాడారు.పితృస్వామ్యానికి వ్యతిరేకంగా శూద్రుల, అస్పృశ్యుల, మహిళ సకల హక్కుల కోసం పోరాటం చేయటం తమ సామాజిక బాధ్యతగా ఆ దంపతులు విశ్వసించారని చెప్పుకచ్చారు. సావిత్రి భాయ్ పూలే జయంతిని మహిళ ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అస్లాం, నద్దు, చిట్యాల దయాకర్, అక్రమ్, మణి తదితరులు పాల్గొన్నారు.

Please follow and like us:

You may also like...