Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

ప్రభుత్వ షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో క్రీడోత్సవాలు

క్రీడలను ప్రారంభించిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్..

ఈరోజుటీవి/జగిత్యాల/టౌన్: జగిత్యాల పట్టణంలోని స్వామి వివేకానంద మినీ స్టేడియంలో షెడ్యూల్డ్ కులాల జగిత్యాల జిల్లా స్థాయి వసతి గృహముల క్రీడోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డా, సంజయ్ కుమార్.జిల్లాలోని 18 వసతి గృహాల నుండి విద్యార్థిని విద్యార్థులకు కోకో,వాలీబాల్,కబడ్డీ మరియు చెస్, క్యారమ్స్ పోటీలను ఎమ్మెల్యే ప్రారంభించారు..ఈసందర్భంగా డా. సంజయ్ కుమార్ మాట్లాడుతూ ప్రజల ఆశిశులతో మళ్ళీ తెరాస ప్రభుత్వం అధికారం లోకి వచ్చిందని నేను కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చదివానాని దళిత బిడ్డలు షెడ్యూల్డ్ వసతి గృహాల్లో గతం లో మెస్ఛార్జ్ లు 750/- ఉంటే తెరాస ప్రభుత్వం వచ్చిన హాస్టల్ లో సన్న బియ్యం ఇప్పుడు చిన్న వారికి 950/-పెద్ద వారికి 1100/-కాలేజీ వారికి 1500/- గతంలో 2 జతల దుస్తులు ఇచ్ఛేవారని ఇప్పుడు 4 జతల దుస్తువులు, బెడ్, బెడ్ షిట్లు, దుప్పటి, షూస్, ట్రాక్ సూట్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చాక అందజేస్తున్నామని, ప్రపంచ మేధావి డాక్టర్ బాబా సాహెబ్ అంబెడ్కర్ ఆలోచన విధానం అలవర్చుకొని కష్టపడి చదువుకోవాలని ఉన్నత స్థానాలను అధిరోహించాలని,క్రీడల ద్వారా శారీరక దారుడ్యం, క్రీడా  పోటీల వల్ల మంచి స్నేహ సంబంధాలు పెంపొందుతాయని, చెస్, క్యారమ్స్ వల్ల మేధాశక్తి  పెంపొందుతుందని, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి పోటీలలో వెళ్ళడానికి కృషి చేయాలని సూచించారు.
నా యొక్క సహకారం ఎప్పుడు ఉంటుందని సంజయ్ కుమార్ అన్నారు. అనంతరం జె.సి రాజేశం మాట్లాడుతూ జిల్లాలోని అన్ని హాస్టల్ లకు విద్యార్థులకు క్రీడలు నిర్వహించడం అభినందనీయమని, రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తుందని గెలుపు ఓటములను సమయస్ఫూర్తిగా తీసుకోవాలని తెలిపారు. ఈకార్యక్రమంలో జిల్లా షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి అధికారి రజిత, హాస్టల్ వార్డెన్ లు, వ్యాయమ ఉపాధ్యాయులు, తెరాస జగిత్యాల మండల అధ్యక్షుడు రౌత్ గంగాధర్, ఒడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వల్లపు మొగిలి, పుదరి జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.

Please follow and like us:

You may also like...