Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

ఆధార్…బేజార్…?

ఆధార్ కోసం అవస్థలు.! ప్రొద్దున్నే వస్తారు… ఏ పాగాలో.. ఏ చీకటి పడే సమయానికి అయినా పని అయితదా అంటే ఏమో నే అక్కడ దొరికే సమాధానం… కూర్చొనికి సరిపడా కుర్సీలు ఉండవ్, బాత్రూం లు అసలు ఉండవ్, నీళ్ల వసతి అయితే దేవుడెరుగు, నెట్ ఎప్పుడు పని చేస్తదో ఎవరికీ తెలియదు ? సమాచారం చెప్పడానికి సంభందించిన వారుండరు, తెలిసినోడు ప్రక్కన కూర్చొని పని కానిచ్చుకుంటాడు.

ఈరోజుటీవి/జగిత్యాల/బ్యూరో : జిల్లా కేంద్రంలోని ఈ సేవ కేంద్రంలో ఆధార్ నమోదు కోసం పడుతున్న అవస్థలు అంత ఇంత కాదు. ఒక ప్రక్క కేంద్ర ప్రభుత్వం ఆధార్ తప్పనిసరి కాదు అంటుండగా , ప్రతి గుర్తింపునకు ఆధార్ తప్పనిసరి అవసరంగా ఉంది . అయితే జగిత్యాల పార్క్ సమీపంలోని ఈ సేవా కేంద్రంకు ఆధార్ నమోదుకు హాజరవుతున్న వారి సంఖ్య తక్కువ ఏమీ లేదు. ఇది వరకు కొన్ని గుర్తించిన మీ సేవలో కూడా ఆధార్ నమోదుకు అవకాశం ఉండేది. ఏ కారణం చేతో మీ సేవలో ఆధార్ నామోదు తొలగించారు. ప్రస్తుతం పార్క్ ఏదుట గల ఈ సేవలో రవాణా శాఖ,విద్యుత్తు బిల్లులకు సంబంధించి సేవలు మాత్రమే లభ్యమవుతున్నాయి. దానికి తోడు కొంత కాలంగా ఆధార్ నమోదు సేవలు అందుతున్నాయి. అయితే అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా కొనసాగుతున్న ఈ సేవ కేంద్రంలో నమోదుకు వచ్చే వారికి సౌకర్యాల విషయంలో నిర్వాహకులు ఏమాత్రం పట్టించుకోకుండా వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు తావిస్తోంది. అంతే కాకుండా అరకొర సిబ్బంది వల్ల గంటల కొద్దీ నిరీక్షించాల్సిన పరిస్థితి ఉంటుంది. దూర ప్రాంతాల నుండి ఆధార్ నమోదుకు చిన్నారులతో వస్తున్న తల్లుల పరిస్థితి దారుణంగా ఉంటుంది. ఏమైనా ఈ సేవా (ఆధార్ ) నమోదు కేంద్రంలో నిర్వాహకులు ఆడిందే ఆట, పాడిందే పాటగా కొనసాగుతుందని సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా సౌకర్యాల కల్పనకు అధికారులు ఈ సేవా కేంద్రంపై దృష్టిసారించాలని ప్రజలు కోరుతున్నారు.

Please follow and like us:

You may also like...