Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

కరీంనగర్ కు చేరుకున్న సీఎం కేసీఆర్

ఈరోజుటీవి/కరీంనగర్/బ్యూరో: కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణపు పనుల పరిశీలన కోసం ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు నేడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించారు.
ఉదయం హైదరాబాద్ నుండి హెలికాప్టర్ ద్వారా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నిర్మాణం అవుతున్న కాళేశ్వరం ప్రాజెక్ట్ లోని అన్ని బ్యారేజీలతో పాటు పంపు హౌజ్ నిర్మాణాలు పనులను ఇరిజిగేషన్ ఇంజినీరింగ్ అధికారులుతో కలసి పరిశీలించారు.
అనుకున్న సమయానికి ప్రాజెక్ట్ పనులను పూర్తి చేసి త్వరలోనే కాళేశ్వరం ప్రాజెక్ ఫలాలను రైతులకు అందజేసేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
ఇక రేపు కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే సీఎం కేసీఆర్ పర్యటించనున్న నేపథ్యంలో రాత్రి బస చేయడానికి కరీంనగర్ జిల్లా తీగలగుంటపల్లిలోని ఉత్తర తెలంగాణ భవన్ కు కొద్దీ సేపటి క్రితమే ఆయన చేరుకున్నారు.
రాత్రికి ఇక్కడే బస చేసి రేపు ఉదయం ఎస్సారెస్పీ పునర్జీవ పథకం నిర్మాణపు పనుల పరిశీలనకు సీఎం కేసీఆర్ వెళ్లనున్నారు.

Please follow and like us:

You may also like...