Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

వస్త్ర గోదాం లో అగ్నిప్రమాదం

ఆరు లక్షల ఆస్తి నష్టం…

ఈరోజుటీవి/మండపేట/క్రైమ్: గాంధీనగర్ రెండవ వీధిలోని ఓ ఇంట్లో షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం సంభవించింది. బుధవారం తెల్లవారుజామున ఇంట్లో షార్ట్ సర్క్యూట్ కావడం వల్ల మంటలు చెలరేగాయి. ఇంట్లో ఉన్నదుర్గ శ్రీ క్లాత్ రెడీమేడ్ వస్త్రాలకు సంబంధించిన బేళ్ళు కాలి బూడిదయ్యాయి. దీంతోఇంట్లో ఓ పోర్షన్ లో రూ.4 లక్షల విలువైన వస్త్రాలు కాలిపోగా మరో పోర్షన్ లో రూ. 2 లక్షల విలువైన వస్త్రాలు కాలిపోయాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక దళ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. మంటలను అదుపు చేశారు. కాగా హోల్ సెల్ వ్యాపారం కోసం దుర్గ శ్రీ క్లాత్ రెడీమెడ్ వస్త్రాలు నిల్వ ఉంచిన ఈ గొడవల్లో మొత్తం సరుకు కాలిపోవడంతో యజమానులు తీవ్ర నష్టానికి గురయ్యారు. సంక్రాంతి సీజన్ కావడంతో ఎక్కువ నిల్వ ఉంచినట్లు తెలుస్తోంది. గాంధీనగర్ 25 వార్డ్ పరిధిలోని 2 వ వీధి లో ఆండ్రా ఏకేశ్వరరావు కు చెందిన ఈ పోర్షన్ లో రూ 4 లక్షల నష్టం జరిగింది. అలాగే పక్క వాటలో ఉంటున్నఆండ్రా శివయ్య కు చెందిన వస్త్రాల తన్లు కూడా అగ్నికి ఆహుతి అయ్యాయి.వీటి విలువ రూ 2 లక్షల ఉంటుందని అంచనా. శివయ్య కాపురం అదే కావడం తో గృహ ఉపకరణాలు కూడా కాలిపోయాయి. అగ్నిమాపక సిబ్బంది ఆధ్వర్యంలో ఇంచార్జ్ ఫైర్ అధికారి బి ప్రభాకరరావు మంటలను అదుపు చేశారు.16 వ వార్డ్ కౌన్సిలర్ వాసా రవి కిరణ్ బాబు,టిడిపి నాయకులు సుంకర రఘు,బిజెపి కన్వీనర్ కోన సత్యనారాయణ లు అక్కడికి చేరుకుని నష్టపోయిన ఇంటి యజమానులను పరామర్శించారు.

Please follow and like us:

You may also like...