Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

తరగతి గదిలో ఉరివేసుకొని ఆత్మహత్య ?

జగిత్యాల పట్టణంలోని గీతావిద్యాలయం స్కూల్ లో ఆరవతరగతి గదిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న దినేష్ అనే 10వ తరగతి విద్యార్థి. ఆత్మహత్య కాదు హత్య అని భావిస్తున్న కుటుంబ సభ్యులు. హత్యనా? ఆత్మహత్యనా ?విచారణ చేస్తున్న పోలీసులు…

ఈరోజుటీవి/జగిత్యాల/క్రైమ్: జగిత్యాల పట్టణం లో గల గీతా విద్యాలయం పాఠశాల లో పదవతరగతి విద్యార్థి అనుమానాదాస్పదన్గా మృతి చెందాడు వివరాల్లోకి వెళితే రాయికల్ మండలం సింగరావ్ పెట్ కి చెందిన ఓ విద్యార్థి స్థానిక వాల్మీకి ఆవాసం లో ఉంటూ విద్యనభ్యసిస్తున్నారు. అయితే యదావిధిగా ఈ రోజు స్కూల్ కి మధ్యాహ్నం వెళ్లిన సదరు విద్యార్థి అనుమానాదాస్పద స్థితిలో తన తరగతి గదిలో కాకుండా ప్రక్కనే ఉన్న ఆరవ తరగతి గదిలో ఓ ప్రక్కనే పడి ఉండటం చూసిన క్లాస్ టీచర్ ఈ విషయాన్ని వాల్మీకి ఆవాసం వార్డెన్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తున్నది. ఆవాసం వార్డెన్ వెళ్లి చూడగా విద్యార్థి మెడ మీద గొంతు తెగిన ఆణమాలు ఉన్నట్లు తెలిపినారు. వెంటనే జగిత్యాల ఏరియా ఆసుపత్రికి తీసుకు రాగా పట్టణ ఎస్సై అల్తాఫ్ ఖాన్ విద్యార్థి వద్ద నుండి ఓ చిన్న పేపర్ ను తీసి పాత్రికేయుల సమక్షం లో చూపించడం జరిగింది. ఇది ఇలా ఉండగా దినేష్ కుటుంబ సభ్యులు మాత్రం ఇది ముమ్మాటికీ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సంఘటన జరిగిన వెంటనే తమ దృష్టికి ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించాల్సిన పరిస్థితి ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందని దీనిపై పోలీసులే హత్యా లేక ఆత్మహత్యా అని తేల్చాలి అని ప్రశ్నిస్తున్నారు.

Please follow and like us:

You may also like...