Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

గల్ఫ్ గడ్డ మీద ఘనం గా ఎల్లాల శ్రీనన్న జన్మదిన వేడుకలు

దుబాయ్ లో ప్రముఖ చిన్నపిల్లలా వైద్యులు, సామాజిక సేవకులు డాక్టర్ ఎల్లాల శ్రీనివాస్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు…ముఖ్యఅతిథి గా తెలంగాణ ప్రముఖ రచయిత,నిర్మాత శ్రీ రాజమౌళి..

ఈరోజుటీవి/గల్ఫ్/దుబాయ్: దుబాయ్ ఎల్లాల శ్రీనన్న సేవాసమితి ఆధ్వర్యంలో దుబాయ్ లోని జెబల్ అలీ క్యాంపులో శ్రీనన్న పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. యూఏఈ నలుమూలల్లో ఉన్నటువంటి సేవాసమితి సభ్యలు అంతా ఎంతో ఆనందంతో, ఉత్సాహంతో పాల్గొని కేక్ కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది, ఈ సందర్భంగా సేవాసమితి సభ్యడు రమేష్ దాసరి రచించిన ఒక అద్భుతమైన పాటను డాక్టర్ గారికి పుట్టినరోజు బహుమతిగా అందజేయడం జరిగింది,
ఈ సందర్భంగా సేవాసమితి అధ్యక్షులు రవి ఊట్నూరి మాట్లాడుతూ డాక్టర్ ఎల్లాల శ్రీనివాస్ రెడ్డి  స్ఫూర్తి తో యూఏఈ లో సేవాసమితి స్థాపించుకున్నామని పేర్కొన్నారు.  ఈ నేపధ్యం లో ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు ఎంతో మందికి ఎన్నోరకాలుగా సేవచేసామని స్పష్టం చేశారు. అదే విధంగా శ్రీనన్న పుట్టినరోజు అంటే మాకు పండగ, ఇలాగే ప్రతి ఏడు జరుపుకుంటామని గుర్తు చేసుకున్నారు.  గత కొద్దీ ఏళ్లుగా దుబాయ్ లోనే జన్మదిన వేడుకలు జరుపుకునేది కానీ దుబాయ్ నుండి సెలవులపై ఇండియా కు వచ్చిన మా సేవ సమితి సభ్యులు ఈ సంవత్సరం ఇండియాలో కూడా వినూత్నంగా శ్రీనన్న పుట్టినరోజు వేడుకలు జరపడం జరిగిందని అన్నారు.  నిజామాబాద్ లోని మానవతా సదన్ ఆశ్రమంలో ని పిల్లలకు కావలసిన దుప్పట్లు మరియు అన్నదానం చేస్తున్నాము. జగిత్యాల లోని శ్రీ వాల్మీకి ఆవాసంలో పిల్లలకు చలి దుస్తువులు మరియు అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామంలోని వృద్ధాశ్రమంలో ఫ్రూప్ట్స్ అందించడం జరుగుతుందని చెప్పారు. ఇలా డాక్టర్ వారి అడుగుజాడల్లో ఇంకా మున్ముందు ఎన్నో కార్యక్రమాలు సేవాసమితి ద్వారా చేయటం జరుగుతుంది. ఈ పుట్టినరోజు వేడుకలకు ముఖ్యఅతిథి గా తెలంగాణ ప్రముఖ రచయిత,నిర్మాత శ్రీ రాజమౌళి  విచ్చేసారని, మరియు సేవాసమితి సభ్యులు, ఇంకా వివిధ కంపెనీల్లో పనిచేస్తున్నటువంటి యువకులు అధికసంఖ్యలో పాల్గొని ఎంతో ఉత్సాహంతో విజయవంతం చేయడం జరిగిందని ఓ ప్రకటనలో తెలియజేశారు.

Please follow and like us:

You may also like...