Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

చట్టం ను పక్కాగా అమలు చేయాల్సిందే?

విద్యాహక్కు చట్టం పక్కాగా అమలు చేసి పండితులను స్కూల్ అసిస్టెంట్స్ గా గుర్తించాలి…ఆర్.యు.పి.పి.టి. జిల్లా ప్రధాన కార్యదర్శి వేల్పుల స్వామి యాదవ్..

ఈరోజుటీవి/రాయికల్: రాష్ట్రంలోని తెలుగు, హింది, ఉర్దూ భాషలు బోధిస్తున్న భాషాపండితులు ఉమ్మడి రాష్ట్రం నుండి దశాబ్దాల కాలంగా శ్రమదోపిడి, వెట్టిచాకిరి కి గురౌతున్నారని కావున భాషాపండితులకు సమానపనికి సమాన వేతనం సమాన గౌరవం కల్పించి వెట్టిచాకిరి శ్రమదోపిడి నుండి విముక్తి కల్పించాలని, విద్యాహక్కు చట్టం పూర్తిగా అమలు చేసి ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలో గ్రేడ్-2 భాష పండిత పోస్టులను రద్దు చేసి స్కూల్ అసిస్టెంట్స్ చే బోధన చేపించాలని కోరారు. భూపతిపూర్ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులుగా పని చేసి నేడు ఉద్యోగ పదవీ విరమణ పొందుచున్న ఏనుగు రాజరెడ్డి ఉద్యోగ పదవీ విరమణ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా పాల్గొని మాట్లాడుతూ పండిత పరిషత్ భాషాపండితుల సమస్యల పరిష్కారానికి ఎనలేని కృషి, రాజీలేని పోరాటం చేస్తుందని, ఇట్టి పోరాటాల ఫలితంగానే రాష్ట్రంలో తెలుగు, హిందీ ఉపాధ్యాయులకు ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతులు సాధించుకున్నామని అన్నారు. ప్రాథమిక స్థాయిలో హిందీని ప్రవేశ పెట్టి తెలుగు హిందీ పండితులను నియమించాలని, భాషపండితుల ఆత్మగౌరవ సమస్యలు పరిష్కరించాలని, 17, 18 జీవోలు అమలు పరుస్తూ పండితులకు వెంటనే పదోన్నతులు కల్పించాలని కోరారు. అనంతరం పండిత పరిషత్ జిల్లా, మండల శాఖల పక్షాణ ఉద్యోగ పదవీ విరమణ పొందిన గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు ఏనుగు రాజరెడ్డిని ఘనంగా శాలువాలతో సత్కరించి భగవద్గీత ప్రధానం చేసారు. ఆయన విద్యార్తులకు, సంఘానికి చేసిన సేవలు అభినందనీయమని, మరువలేనివని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో పండిత పరిషత్ నాయకులు కామని లక్ష్మయ్య, మోర నరహరి, సిద్ధే గంగారాజం, కాకుస్తం శ్రీనివాస స్వామి, కూరగాయల సురేష్, చిటేటి ప్రతాప్ రెడ్డి, సైదుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

Please follow and like us:

You may also like...