Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

మీ అందరివాడిగా నన్ను ఎమ్మెల్సీ గా గెలిపిస్తే మీ కోసమే నిరంతరం శ్రమిస్తా…

ఓనమాలు నేర్చిన మొదటి నుండి పదవతరగతి వరకు సర్కారు బడిలో చదివా… ఉద్యోగం లో చేరిన నాటి నుండి ఎన్నో సమస్యలు చూసా…. వయస్సులో చిన్న వాడినే కావొచ్చు గాక, కానీ నా వెనుక అపార అనుభవం గల ఎస్టీయూ లాంటి సంఘం ఉంది… అవకాశం ఇచ్చి చూడండి… నిరంతరం మీ శ్రమకు నేను తోడుంటా… మీ వెన్నంటి మీ వాడిలా మెదులుతా…

ఈరోజుటీవి/జగిత్యాల/టౌన్: జగిత్యాల జిల్లా కేంద్రం లో నిర్వహించిన పాత్రికేయుల సమావేశం లో ఎస్టీయూ ఉపాధ్యాయ, అధ్యాపక సంఘాలు బలపరచిన ఎమ్మెల్సీ అభ్యర్థి మామిడి సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా సంఘ పెద్దలు మాట్లాడుతూ మా అభ్యర్థి ఇరువై ఏండ్ల భావి ఉపాధ్యాయ జీవితమును మేధావుల, సమాజ శ్రేయస్సు ను దృష్టి లో ఉంచుకుని తృణప్రాయంగా త్యజిస్తూ, స్వచ్చందంగా చేస్తున్న ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేసి విద్యారంగ సేవకునిగా మీ అందరివాడిగా, మీలో ఓ కుటుంబ సభ్యుడిగా నన్ను గుర్తించి రానున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ఉంటున్నానని నను గనుక గెలిపిస్తే మీకోసమే నిరంతరం శ్రమిస్తానని ఎస్టీయూ బలపరచిన ఉపాధ్యాయ, అధ్యాపక సంఘాల ఎమ్మెల్సీ ఉమ్మడి అభ్యర్థి మామిడి సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు.

ఆదివారం స్థానిక ఎస్టీయూ భవన్ లోమాట్లాడుతూ సీపీఎస్ ఉపాధ్యాయునిగా, ఉపాధ్యాయ భాధితునిగా నలిగిపోతూ ఒక లక్ష ఇరువై ఆరువేల మంది ఉద్యోగ, ఉపాధ్యా యుల పదవీ విరమణ అనంతర భవిష్యత్తు ను నిర్లక్ష్య పరుస్తున్న ప్రభుత్వ విధానాన్ని నిరసించి, వారి భవిష్యత్తును ఓపీఎస్ తో పరిరక్షించాలని, అందుకు గాను శాసన మండలి అనేది సరైన వేదికగా భావించి తాను దృఢసంకల్పం తో ఈ ఎన్నికల బరిలో ఉండబోతున్నానని ఈ సందర్భాంగా మామిడి సుధాకర్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ నేపధ్యం లో తానూ మాట్లాడుతూ ఏకీకృత సర్వీసు రూల్స్ సాధనకు కృషి చేసి, ఉపాధ్యాయులకు కావలసిన పదోన్నతుల కల్పనకు కృషి చేస్తానని, పండిత్, పీఈటీ ల అప్గ్రేడేషన్ ల కల సాకారం చేయుట, మాడల్ స్కూళ్ల, కేజీబీవీ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేయనున్నట్లు తెలిపారు. ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు భుజంగరావు మాట్లాడుతూ ఉపాధ్యాయ, అధ్యాపకులందరం మేధావులుగా ఆలోచిద్దాం, చట్ట సభల నిర్ణేతలుగా నిర్ణయించుకుందాం అని గుర్తు చేశారు. ఈ నేథ్యం లో తానూ మాట్లాడుతూ నిజాయితీని బ్రతికించుకుందాం అని అన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గా మామిడి సుధాకర్ రెడ్డి ని గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. ” ఒక మార్పు కోసం, అదీ మన మంచి కోసమే ” అని భావించి ఉపాధ్యాయులమంతా సంపూర్ణ మద్ధతు ను సుధాకర్ రెడ్డి కి అందించాలని కోరారు. సమస్య పరిష్కారం లో ఉపాధ్యాయుల పక్షాన శాసన మండలిలో ఉపాధ్యాయుల గొంతును వినిపించాలన్న ఏకైక లక్ష్యం తో మీ ముందుకు రావడం జరిగిందని ఈ సందర్బంగా గుర్తుచేశారు. ఉపాధ్యాయులందరూ తన ఉద్యోగ జీవితం లో కనీసం ఇంటి స్థలాన్ని సమకూర్చుకోలేని దుస్థితి దాపురించిందని, ఆ నేపధ్యం లో మనం గనుక ఎమ్మెల్సీ గా గెలిపించుకుంటే ఉపాధ్యాయులకు తాము పని చేసే మండల, జిల్లా కేంద్రాల లో ఇండ్ల స్థలాలు సమకూర్చుటలో ముందుంటానని స్పష్టం చేసిన ఆయన ఎస్టీయూ వద్ద పూర్తి స్థాయిలో ప్రణాళిక సిద్ధంగా ఉందని తెలిపినారు. ఈ సమావేశం లో ఎస్టీయూ జగిత్యాల జిల్లా అధ్యక్షులు గుర్రం శ్రీనివాస్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి తుంగూరి సురేష్, మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి మింగర్రి ప్రణీత్ కుమార్, రాష్ర ఉపాధ్యక్షులు బైరం హరి కిరణ్, రాష్ట్ర ఆ ర్ధిక కమిటీ సభ్యులు నాయిని విజయానంద్ రావు, గజభీంకార్ గోవర్ధన్, జిల్లా ఆర్ధిక కార్యదర్శి బాల్ చిన్నయ్య, నాయకులు మచ్చ శంకర్, కరుణాకర్, శేఖర్, దశరథ రెడ్డి, శివ రామ కృష్ణ, భీమయ్య, క్రిష్ణ , బలరాం, గంగాధర్, రవీంధర్, వెంకటేష్, ప్రసాద్, శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Please follow and like us:

You may also like...