Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

తెలంగాణ పంచాయతీపై కఠిన ఆంక్షలు!

బెయిల్‌పై ఉన్నా
ఐపీపెట్టినా అనర్హులే – కాంట్రాక్టర్లు
ఉద్యోగులు పోటీచేయరాదు

ఈరోజుటీవి/హైదరాబాదు/బ్యూరో:తెలంగాణ లో గ్రామా పంచాయతీ ఎన్నికల నేపధ్యం లో ఆంక్షలు మరింత కఠినతరమైనవి అవి ఏంటో తెలుసా. వివరాల్లోకి వెళితే (అభ్యర్థులను బెదిరించినా) .. ఎత్తుకెళ్లినా ఏడాది జైలు, ఆరేండ్లు నిషేధం – ఏకగ్రీవ పంచాయతీలపై కలెక్టర్ల విచారణ తర్వాతే ప్రకటన – సందేహాలను నివృత్తిచేసిన ఎన్నికల కమిషన్ హైదరాబాద్, పంచాయతీ ఎన్నికల్లో నిబంధనలు కఠినతరమయ్యాయి. అభ్యర్థులు పాటించాల్సిన నిబంధనలతోపాటు అర్హతలను రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టంగా వివరించింది. పంచాయతీల ఏకగ్రీవం కోసం వేలం వేయడం, ఓటర్లను కొనుగోలుచేయడం వంటి చర్యలకు పాల్పడితే.. జైలుశిక్ష, జరిమాన, అనర్హతవేటు ఉంటుందని హెచ్చరించింది. ఇప్పటివరకు ఏకగ్రీవ పంచాయతీలను రిటర్నింగ్ అధికారులే ప్రకటిస్తుండగా.. ఇకనుంచి విచారణ జరిపిన తర్వాత జిల్లా కలెక్టరే ప్రకటిస్తారని పేర్కొన్నది. విచారణలో వేలం వంటి వ్యవహారాలు బయటకు వస్తే.. ఏకగ్రీవాలను రద్దుచేసే అధికారం కలెక్టర్‌కు ఉంటుంది.

వీరంతా పోటీకి అనర్హులే- క్రిమినల్‌కోర్టు దోషిగా నిర్ధారించినవారిని శిక్ష ఖరారైనరోజు నుంచి ఐదేండ్ల వరకు స్థానికసంస్థల్లో పోటీచేసేందుకు అనర్హుడిగా పరిగణిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. బెయిల్‌పై విడుదలైనవారికి పోటీచేసే అవకాశం ఉండదు. – ఆర్థికంగా దివాళాతీసినట్టు కోర్టు నిర్ధారించినవారు, ఐపీపెట్టినవారు, ఐపీకి దరఖాస్తు చేసుకున్నవారు అనర్హులు. – ప్రభుత్వ పనులు పొంది కాంట్రాక్టులు చేస్తున్నవారు, పారితోషికం తీసుకుంటూ పంచాయతీ తరుపున లేదా వ్యతిరేకంగా లీగల్ ప్రాక్టీషనరుగా పనిచేసేవారు అనర్హులే. – మతిస్థిమితం సరిగా లేనివారు, చెవిటి, మూగవారు అనర్హులు. ప్రస్తుత, గత ఆర్థిక సంవత్సరంలో పంచాయతీకి బకాయి ఉండటం, నోటీసు ఇచ్చినా, తదుపరి గడువు ముగిసినా బకాయిచెల్లించనివారు అనర్హులే. – ఇద్దరి కంటే ఎక్కువమంది పిల్లలుంటే పోటీచేయరాదు. ఇద్దరు పిల్లలు ఉండి, మరొకరిని దత్తత తీసుకున్నా అనర్హులే. 1995కు ముందు ఇద్దరి కంటే ఎక్కువమంది పిల్లలు ఉన్నా, ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు కలిగినా, ఒక కాన్పులో కవలలు పుట్టి, అంతకుముందు ఒక సంతానం ఉన్నా అర్హులే. ఈ పదవుల్లో ఉన్నవారంతా అనర్హులే- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానికసంస్థల ఉద్యోగులు, సాగునీటి వినియోగదారుల సంఘం సభ్యులు, అంగన్‌వాడీ వర్కర్లు, దేవాలయాలు, మతసంస్థల చైర్మన్లు, ఆర్టీసీ, సింగరేణి కాలరీస్‌లో పనిచేస్తూ కొంత హోదా కల్గినవారు పంచాయతీ ఎన్నికల్లో పోటీచేసేందుకు అర్హులుకాదని రాష్ట్ర ఎన్నికలసంఘం తేల్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానికసంస్థల ఉద్యోగులు ముందుగా వారి రాజీనామాను ఆమోదం చేసుకున్న తర్వాతే నామినేషన్లు దాఖలుచేయాలి. – ప్రభుత్వం ద్వారా 25 శాతం కంటే ఎక్కువ పెట్టుబడి కలిగిన సంస్థలు, కంపెనీల మేనేజింగ్ ఏజెంట్లు, మేనేజర్లు, కార్యదర్శులు స్థానిక ఎన్నికల్లో పోటీచేయరాదు. సహకారసంఘాల సభ్యులు, రేషన్‌డీలర్లు స్థానిక ఎన్నికల్లో పోటీచేసేందుకు అర్హులేనని ఎన్నికల సంఘం స్పష్టంచేసింది. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలునిబంధనలను ఉల్లంఘించి అభ్యర్థులను బెదిరించి, ఎత్తుకెళ్లినా, ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తూ దొరికినా ఏడాది జైలుశిక్షతోపాటు జరిమానా విధిస్తారు. ఆరేండ్లు ఎలాంటి పదవులకు పోటీచేయకుండా అనర్హతవేటువేస్తారు. పోలింగ్ ముగిసే సమయానికి 44 గంటల ముందే ప్రచారం నిలిపేయాలి. ఎన్నికలకోడ్ ఉన్నన్ని రోజులూ సభలు, ఊరేగింపులు నిషేధం. ప్రచారానికి ప్రభుత్వ, ప్రైవేట్ స్థలాలను వినియోగిం చడం, దేవాలయాలు, మసీదులు, చర్చిలు, ఇతర ప్రార్థనాస్థలాలను చర్చావేదికగా వాడుకోవడం నేరం. నిబంధనలను ఉల్లంఘిస్తే మూడు నెలల జైలుశిక్ష, జరిమాన విధిస్తారు.ఇతరులను ప్రేరేపిస్తున్నట్లు మాట్లాడినా చర్యలు తప్పవు. ఎన్నికల పర్యవేక్షణకు పరిశీలకులుఎన్నికల నోటిఫికేషన్ విడుదలచేసినరోజు నుంచి మూడోరోజు మధ్య నామినేషన్లు దాఖలుచేయాల్సి ఉంటుందపి ఎన్నికల సంఘం కార్యదర్శి అశోక్‌కుమార్ తెలిపారు. నామినేషన్ల చివరిరోజే పరిశీలన ఉంటుందని, మరుసటి రోజు తిరస్కరించిన నామినేషన్లపై అప్పీల్ చేసుకోవచ్చని, అదేరోజున పరిష్కరిస్తారని పేర్కొన్నారు. సర్పంచ్‌గా పోటీపడేవ్యక్తి గ్రామపరిధిలో, వార్డుసభ్యుడిగా పోటీపడేవారు ఆ వార్డులో కచ్చితంగా ఓటరుగా నమోదై ఉండాలని సూచించారు. ఒక అభ్యర్థి ఒక వార్డుకు మించి పోటీచేయరాదని స్పష్టంచేశారు.తెలుగు అక్షర క్రమంలో గుర్తులునామినేషన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత రిటర్నింగ్ అధికారులు తుది జాబితాను తెలుగు అక్షరమాల క్రమంలో ప్రకటిస్తారు. అభ్యర్థుల జాబితాలో తెలుగు అక్షరమాల ప్రకారం మొదటివ్యక్తికి ఎన్నికలకమిషన్ ప్రకటించిన గుర్తుల్లో మొదటిగుర్తును కేటాయిస్తారు. రెండో అభ్యర్థికి రెండోగుర్తును ఇస్తారు. ఒకవేళ ఇద్దరి పేర్లు ఒకేలా ఉంటే నామినేషన్ సంఖ్య ఆధారంగా గుర్తులను కేటాయిస్తారు

Please follow and like us:

You may also like...