Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

జిల్లాలో తగ్గుముఖం పట్టిన క్రైమ్ ?

ఫ్రెండ్లీ పోలీసింగ్ ప్రభావమేమో ? గతేడాదితో పోలిస్తే 29 కేసులు తక్కువ నమోదు ! స్పష్టం చేసిన ఎస్పీ సింధు శర్మ…

ఈరోజుటీవి/జగిత్యాల/క్రైమ్: జిల్లా పరిధిలో 2018 లో 2243 కేసులు నమోదు గతేడాది నమోదు అయిన కేసులతో పోలిస్తే 29 కేసులు తక్కువగా నమోదు కావడం జరిగింది. మహిళల రక్షణ కై , ఈవీటీజింగ్ నిరోధానికి జిల్లాలో ఏర్పాటు చేసిన షీ టీం లు 61 అవగాహన సదస్సు లు నిర్వహించి, 147 మందికి కౌన్సిలింగ్ చేయడం జరిగింది.

ముందస్తు ప్రణాళిక తో పకడ్బందీ బందోబస్తు తో 2018 ఎన్నికలు ప్రశాంతం వాతావరణంలో జరిగాయి.
బ్లూ కోల్ట్స్ సిబ్బంది టౌన్ పరిధిలో ద్విచక్రవాహనంపై పట్టణంలో, శివారు ప్రాంతాలలో తిరుగుతు ఏదైనా సంఘటన జరిగిన సమయంలో త్వరితగతిన అక్కడికి చేరుతూ ప్రజలకు నాణ్యమైన సేవలను అందిస్తున్నాయి.
జిల్లాలో రోజు నిర్వహిస్తున్న పెట్రోలింగ్, బీట్లు నేర నియంత్రణ కి దోహద పడుతున్నాయి.
ఎన్నికల నేపధ్యంలో 379 కేసులలో 2971 మంది శాంతి భద్రతలకు విఘాతం కలిగించు వ్యక్తులు, రౌడి షీటర్లు, నేర చరిత గల వారిని బైండోవర్ చేయడం  జరిగిందన్నారు.
పెండింగ్ వారెంట్లు 457 అమలు చేయడం జరిగిందని,
గంజాయి స్మగ్లర్లు ని అరెస్ట్ చెసి వారి వద్ద నుండి 2.565గ్రామ్స్ గంజాయి ని సీజ్ చేసాము.18 మoది పై కేస్ లు నమోదు చేయడం జరిగిందన్నారు.
పెండింగ్ కేసులలో 1638 కేసుల్లో 536 మందికి నేరం రుజువు కాబడి శిక్ష కూడా పడింది.
ఆపరేషన్ ముస్కాన్ ద్వారా 207 మంది బాలకార్మికులను గుర్తించి, 127 మంది ని వారి తల్లిదండ్రులు కి అప్పగించి, 80 మందిని రెస్క్యూ హోమ్ కి అప్పగించాము.
గేమింగ్ ఆక్ట్/ జూదం ఆక్ట్ లో 135 కేస్ లలో 805 మంది పై కేస్ లను నమోదు చేసి 18,46,410 రూపాయలు, సీజ్ చేయడం జరిగింది.
ప్రభుత్వ నిషేధిత గుట్కా ను అమ్మిన వారి పై 91 కేసుల నమోదు చేయడం జరిగింది. మరియు 18,27,567 రూపాయల విలువ గల గుట్కా ను స్వాధీనం చేసుకున్నాము.
మద్యం సేవించి వాహనాలు నడిపిన వారి పై 1307డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదుచేయడం జరిగింది.
వాటి లో 121 మందికి శిక్ష పడగ 14,47,600 రూపాయల జరిమాన విధించడం జరిగింది.
ఇసుక సంబంధిత కేసులు 34.
జిల్లాలో 986 సి సి కెమెరాలు ఏర్పాటు చేసాం. 100% పోలింగ్ స్టేషన్ ల వద్ద సీసీ టీవీ లు ఏర్పాటు చేసి పరిస్థితి ని సమీక్షించడం జరిగింది.

లోక్ అదాలత్ ద్వారా 497 కేసులు పరిష్కరించబడ్డాయి.
ఆన్లైన్ ఈ పెట్టి కేస్ అప్లికేషన్ ద్వారా 1133 కేస్ లను నమోదు చేశాం.
టి ఎస్ కాప్ అప్లికేషన్ ద్వారా పాయింట్ బుక్ లు, 3351 వినాయక మండపాలు ను జియో ట్యాగింగ్ చేశాం.
గత ఎన్నికల్లో 898 పోలింగ్ కేంద్రాలు జియో ట్యాగింగ్ చేసాము.
సి.డాట్ అప్లికేషన్ ద్వారా 161 మంది మిస్సింగ్ పర్సన్ లను గుర్తింపు చేసాము.
ఫింగర్ ప్రింట్ యూనిట్ ద్వారా 03 కేసులు ఛేదించాం.
డయల్ 100 ద్వారా11,803 కాల్స్ ను రిసీవ్ చేసుకొని వాటి ఆధారంగా 342 కేస్ లను నమోదు చేయడం జరిగింది.
జిల్లాలో ఇప్పటి వరకు వివిధ ప్రాంతాలలో 13 కార్డెన్ సర్చ్ లు నిర్వహించడం జరిగింది.
జిల్లాలో మొత్తం 31 లైసెన్సేడ్ వెపన్స్ ను గుర్తించడం జరిగింది అందులో 12 ఎటిఎం ల వద్ద,19 వెపన్స్ ను డిపాజిట్ చేసుకోవడం జరిగింది.
ఆధునిక సాంకేతిక వ్యవస్థ వినియోగంలో భాగంగా ఫేస్ రికగ్నైస్ సాఫ్ట్వేర్ అండ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ సంకేతికతని వినియోగంలోకి తీసుకరవడం జరిగింది.
ఈ చాలన్ : మోటార్ వెహికిల్ ఆక్ట్ ద్వారా విధించిన జరిమానా లు ఆన్లైన్ ద్వారా చెల్లించే సదుపాయం ఏర్పాటు చేస్తున్నాము.
జిల్లాలో ఏర్పటు చేసిన కాళాబృందం గ్రామ స్థాయిలో 85 అవగాహనా కార్యక్రమలు నిర్వహిస్తూ పలు ముఖ్యమైన అంశాలపై అవగాహన కలిగిస్తున్నాయి.
ప్రతి పోలీసు అధికారి వృత్తి నైపుణ్యం మెరుగు పరుచుటకు వర్టీకల్ సిస్టo ద్వారా నైపుణ్యాన్ని మెరుగుపరుస్తూ, వృత్తి నైపుణ్యంలో ప్రతిభ చూపిన వారికి కెపిఐ ( కీ పెర్ఫార్మన్స్ ఇండికేట్స్ ) రివార్డులు అందజేస్తున్నాము.
జిల్లాలో పోలీస్ సిబ్బంది కి మెగా హెల్త్ క్యాంప్ ద్వారా అన్ని రకాల పరీక్షలు చేయడం జరిగింద ని స్పష్టం చేసిన జగిత్యాల జిల్లా ఎస్పీ సింధు శర్మ. ఈ కార్యక్రమం లో అడిషనల్ ఎస్పీ మురళీధర్ తదితరులు పాల్గొన్నారు.

Please follow and like us:

You may also like...