Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

దొంగతనాలను అరికడతాం : హోమ్ మినిష్టర్ అలీ

రాచకొండ సిపి మహేష్‌భగవత్‌కు ఆదేశాలిచ్చామని వివరణ…

ఈరోజుటీవి /హైదరాబాద్/క్రైమ్: హైదారాబాద్ నగరంలో వరుసగా చైన్ స్నాచింగ్‌లకు పాల్పడిన దొంగలను అనతికాలంలో పట్టుకుని వారి ఆట కట్టిస్తామని హోంమంత్రి మహబూద్ ఆలీ పేర్కొన్నారు. చైన్ స్నాచింగ్ దృశ్యాలు సిసి కెమెరాల్లో రికార్డ్ అయ్యాయని, నిందితులను త్వరగా పట్టుకోవాలని రాచకొండ సిపి మహేష్‌భగవత్‌కు ఆదేశాలిచ్చామని ఆయన వివరించారు. ఇతర రాష్ట్రాల నుంచి దొంగల ముఠాలు వచ్చినట్లు ప్రాధమికంగా పోలీసులు గుర్తించారని, రెండు, మూడు రోజుల్లో నిందితులను పట్టుకుంటామని హోమంత్రి స్పష్టం చేశారు. నగరంలో నేరాలను పూర్తిగా తగ్గు ముఖం పట్టేలా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటామన్నారు. నగరంలో నేరం చేయలంటే నేరస్తులు హడలిపోయే విధంగా చర్యలు చేపడుతున్నామన్నారు. నేరాల నియంత్రణ విషయంలో ఏలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో పోలీసు ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తామని వివరించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను పరిరక్షించేందుకు ప్రజలు సైతం సహకరించాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర పోలీసులు అమలు చేస్తున్న ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను మరింత పటిష్టం చేస్తామన్నారు. తెలంగాణ పోలీసుల పనితీరు దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉందని,అనతికాలంలో రాష్ట్రాన్ని నేర రహిత రాష్ట్రంగా మార్చేందుకు పోలీసు శాఖకు అన్ని విధాల సహాయసహకారాలు అందిస్తామని హోంమంత్రి మహబూద్ ఆలీ పేర్కొన్నారు.

Please follow and like us:

You may also like...