Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

ప్రత్యేక డ్రైవ్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు: కేటీఆర్

నూతన ఓటర్ల చేరిక మరియు సవరణ కోసం టిఆర్ఎస్ పార్టీ తరఫున ప్రత్యేక డ్రైవ్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్…
ఎలక్షన్ కమిషన్ కల్పించిన ఈ అవకాశాన్ని పెద్ద ఎత్తున వినియోగించుకోవాలని పార్టీ శ్రేణులకు పిలుపు…
నూతన ఓటర్ల నమోదు తో పాటు, ఓటర్ల జాబితాలో మిస్సయిన వారిని చేర్పించేందుకు పార్టీ శ్రేణులు సహకరిస్తాయన్న కేటీఆర్…
ఈ ప్రక్రియ పైన పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించారాన్న కేటీఆర్…
పార్టీ ప్రధాన కార్యదర్శులతో సమావేశమైన కేటీఆర్…
జిల్లా కేంద్రాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణం పైనా చర్చ…

ఈరోజుటీవి/హైదరాబాద్: నూతన ఓటర్ల చేరిక మరియు ప్రస్తుత ఓటర్ల జాబితా సవరణ పైన చురుగ్గా పని చేయాలని తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలకు నాయకులకు టిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈరోజు హైదరాబాద్ లోని కేంద్ర కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శులతో జరిగిన సమావేశంలో ఓటర్ల జాబితా లోని సవరణల పైన చర్చించారు. ఎలక్షన్ కమిషన్ మరో నెల రోజుల పాటు కొత్త ఓట్ల నమోదు మరియు ఈ జాబితాలో మిస్సయిన ఓటర్ల నమోదు వంటి అవకాశాన్ని కల్పిస్తున్న నేపథ్యంలో ప్రతి గ్రామం కేంద్రంగా అవకాశాన్ని ఉపయోగించుకుని పార్టీ శ్రేణులను ముందుకు తీసుకో పోవాలన్నారు. ఈ మేరకు రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శులు స్థానిక ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జి లతో సమన్వయం చేసుకొని పెద్ద ఎత్తున ఓటర్లను జాబితాలో చేర్చాలన్నారు. ఈ విషయంలో పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారన్నారు. ఈ విషయంలో పార్టీ ఎమ్మెల్యేలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, వారంతా పార్టీ ప్రధాన కార్యదర్శులతో కలిసి ఈ నెల రోజులపాటు సాధ్యమైనంత ఎక్కువ మందిని ఓటర్ల జాబితాలో చేర్చాలన్నారు. స్థానిక ఎమ్మెల్యేలతోపాటు మండల స్థాయి పార్టీ అధ్యక్షులు తోనూ పార్టీ కార్యదర్శులు నేరుగా మాట్లాడుతూ ఈ మొత్తం ప్రక్రియను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లాలని కేటీఆర్ ఆదేశించారు. ప్రధాన కార్యదర్శులు ఈ నెల రోజులపాటు సాధ్యమైనంత ఎక్కువ రోజులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయాలన్నారు.

నూతన ఓటర్ల నమోదు మరియు సవరణ ప్రక్రియను పర్యవేక్షించేందుకు తెలంగాణ భవన్లో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రెండు రోజులకోసారి ఎంతమంది ఓటర్లను నమోదు చేయించేందుకు దరఖాస్తులు సమర్పించారు వాటి తాలూకు జిరాక్స్ ప్రతులను కేంద్ర కార్యాలయానికి పంపాలన్నారు. దీంతోపాటు ప్రతిరోజు ఎంత మంది దరఖాస్తులను నమోదయ్యేలా చేశారు వాటి గణాంకాలను కూడా పంపాలన్నారు. పార్టీ కార్యాలయ కార్యదర్శి మరియు ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి గారు ఈ మొత్తం ప్రక్రియను పర్యవేక్షిస్తారనీ తెలిపారు.

పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అప్పచెప్పిన మరో కీలకమైన అంశం జిల్లా పార్టీ కార్యాలయాలకు భవనాల నిర్మాణం సంబంధించిన ప్రక్రియపైన కూడా ఈ సమావేశంలో చర్చించడం జరిగింది. ప్రభుత్వం అనుమతించిన మేరకు ప్రతి జిల్లా కార్యాలయానికి ఒక ఎకరం మేరకు స్థలాన్ని సేకరించేందుకు అవకాశం ఉందని, ఇప్పటికే దాదాపు 20 జిల్లా కేంద్రాల్లో స్థలాల ఎంపిక పూర్తయిందని కేటీఆర్ తెలిపారు. ఈ స్థలాల ఖరారు చేసేందుకు పార్టీ ఎమ్మెల్యేలతోపాటు పార్టీ ప్రధాన కార్యదర్శులు స్వయంగా వెళ్లి పరిశీలించాలన్నారు. వచ్చే వారం రోజుల్లోగా స్థలాలకు అవసరమైన డబ్బులను పార్టీ చెల్లిస్తుందని, వారం రోజుల్లోగా వాటి స్వాధీనం చేసుకోవాలన్నారు. సంక్రాంతి తర్వాత వరుసగా జిల్లా కార్యాలయాలకు శంకుస్థాపన కార్యక్రమాలు జరుగుతాయని ఈ సందర్భంగా కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ తెలిపారు. ఈ సమావేశానికి రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శులు హాజరయ్యారు.

Please follow and like us:

You may also like...