Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

గొల్లపల్లి మండల కేంద్రం లో ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం

ఈరోజుటీవి/గొల్లపల్లి: ఈ రోజున గొల్లపెల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా జెండా ఆవిష్కరణ చేసి స్వీట్లు పంపిణీ చేసి కాంగ్రెస్ పార్టీ ఒక సముద్రం లాంటిది దానికి గెలుపోటములు సహజం నూటా ముప్పై నాలుగు వ ఆవిర్భావ వేడుకల్లో స్వర్గీయ ఇందిరా గాంధీ రాజీవ్ గాంధీ గారిని తలచుకొని వారికి ఘనంగా నివాళులు అర్పించి తల్లి సోనియా గాంధీ రాహుల్ గాంధీ నాయకత్వంలో రాబోయే రోజుల్లో కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ కి అండగా యావత్ దేశమంతా కూడా కాంగ్రెస్ జెండాలు ఎగరవేసి పేద ప్రజల కోసమే పుట్టిన కాంగ్రెస్ పార్టీ పేదవాడికి అండదండ ప్రతి పేదవాడి ముఖంలో ఆనందం చూడటమే కాంగ్రెస్‌ పార్టీ ఏకైక లక్ష్యం అని అన్నారు. ఈ నేపధ్యం లో యూత్ అధ్యక్షుడు మాట్లాడుతూ 134ఏళ్లలో ఎన్నో ప్రాణ త్యాగాలు చేసి ప్రజల గుండెల్లో నిలిచిన పార్టీ,దేశానికి స్వాత్రంత్ర్యం తెచ్చిన పార్టీ, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీ, ఎన్నో రకాలుగా కాలగమనం లో కాలానికి అనుగుణం గా నాడు స్వాతంత్య్రం తెచ్చిన నాటి పరిస్థితుల్లో నాటి అనుభవాలకనుగుణం గా ఎన్నో పథకాలను అమలు లోకి తెచ్చి బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటూ, అభివృద్ధి చేసిన పార్టీ, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చిన పార్టీ, దేశానికి ఎంతోమంది నాయకులను అందించిన పార్టీ, చరిత్రలో నిలిచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు. అలాగే తప్పకుండా రాబోయే రోజుల్లో పార్లమెంటు ఎలక్షన్లో కాంగ్రెస్ జెండా ఎగర పోతుంది అని విశ్వాసంగా కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపిస్తాను అని ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నిశాంత్ రెడ్డి మండల కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు రమేష్ రెడ్డి ఎంపిటిసిలు కృష్ణ లక్ష్మీ గుంటుకు గంగన్న గొల్లపెల్లి యూత్ కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడు ఆవుల ప్రవీణ్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాపల్లి గంగన్న చెవుల మది శ్రీనివాస్ చందు రవి రమేష్ కాంగ్రెస్ పార్టీ అన్ని గ్రామాల యూత్ అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు అన్ని గ్రామాల మాజీ సర్పంచులు ఎంపీటీసీలు పాల్గొన్నారు

Please follow and like us:

You may also like...