Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

మెడికల్ రిప్ ల సమ్మె

గోడ ప్రతిక ఆవిష్కరణ…. పాల్గొన్న టి.ఎం.ఎస్.ఆర్.యు. జిల్లా నాయకులు.

ఈరోజుటీవి/జగిత్యాల/టౌన్: కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా జనవరి మాసం 8.9వ తేదీల్లో చేపడుతున్న దేశ వ్యాప్త సమ్మెలో మెడికల్ రిప్రజెంటేటివ్స్ పాల్గొని సమ్మెను విజయవంతం చేయాలని కోరుతూ ఈ సందర్భాంగా ముద్రించిన గోడ ప్రతీని తెలంగాణ మెడికల్ మరియు సేల్స్ రిప్రజంటేటివ్స్ యూనియన్ (టి.ఎం.ఎస్.ఆర్.యు.) రాష్ట్ర నాయకులు విద్యాసాగర్ జగిత్యాల లో ఆవిష్కరించారు. ఈ నేపధ్యం లో రాష్ట్ర నాయకులు జి విద్యా సాగర్ మాట్లాడుతూ నిరుద్యోగ సమస్యను అరికట్టి ఉపాధి కల్పన చర్యలు చేపట్టాలని, ప్రభుత్వ రంగ ఫార్మా కంపెనీలను పునరుద్దరించాలని అలాగే కార్మికులకు ఉద్యోగ భద్రతా విషయం లో తగిన చట్టాలు తెచ్చి, కార్మికులకు కనీస గౌరవ వేతనం కింద రూ. 18 వేలు చెల్లించేలా చూడాలని పేర్కొన్నారు. అలాగే ఏక పక్ష కార్మిక చట్ట సవరణలు తక్షణమే నిలిపి వేయాలని ఈ సందర్బంగా డిమాండ్ చేశారు. ఈ సమ్మెలో జగిత్యాల జిల్లా మెడికల్ రిప్స్ అధ్యక్షులు కస్తూరి వెంకట రమణ, కార్యదర్శి పిన్నంశెట్టి రాము, కోశాధికారి కమటాల సునీల్, ఉపాధ్యక్షులు అజయ్ రావ్, శ్రీధర్ బాబులు, సహాయ కార్యదర్శులు జలంధర్, తిరుపతి సింగ్ లు, వర్కింగ్ కమిటీ సభ్యులు రాజేష్, చారి, ఎన్ రాజేష్ మరియు నాగరాజు లతో పాటు మెడికల్ రిప్స్ సభ్యులు పాల్గొన్నారు.

Please follow and like us:

You may also like...