Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

పాఠశాలకు డెస్కులు, కుర్చీల పంపిణీలో ఎల్లాల శ్రీనన్న సేవా సమితి

కార్యక్రమం లో పాల్గొన్న ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు డా ఎల్లాల శ్రీనివాస్ రెడ్డి మరియు గల్ఫ్ ప్రవాస కార్మికులు…

ఈరోజుటీవి/పెగడపల్లి/నరసింహునిపేట: జగిత్యాల జిల్లా పెగడపెల్లి మండలం నరసింహునిపేట గ్రామం లోని ప్రభుత్వ పాటశాల లోని విద్యార్థుల సౌకర్యార్థం దుబాయ్ ఎల్లాల శ్రీనన్న సేవాసమితి వ్యవస్థాపకులు బాబు స్వామి భాస్కర్ ఆధ్వర్యం లో ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు సామాజిక సేవకులు అరుణ హాస్పిటల్ అధినేత డా.ఎల్లాల శ్రీనన్న చేతుల మీదుగా నరసింహుని పేట గ్రామం లోని ప్రభుత్వ మరియు అంగన్ వాడి పాఠశాలలకు డెస్క్ లు మరియు కుర్చీలు అందించటం జరిగింది. ఈ కార్యక్రమం అనంతరం ప్రయాణికుల సౌకర్యార్థం ప్రయాణ ప్రాంగణం లో సిమెంట్ బల్లాలు అందించటం జరిగింది. ఈ నేపధ్యం లో ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు, సామాజిక సేవకులు డా.శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ తాను చేస్తున్న కార్యక్రమాలను ఆదర్శం గా తీసుకుని దుబాయ్ ఎల్లాల శ్రీనన్న సేవా సమితి అనే స్వచ్చంధ సంస్థ ను ఏర్పాటు చేసి ఇంత మంచి కార్యక్రమాలను నిర్వహిస్తున్న సమితి సభ్యులను మరియు వ్యవస్థాపకులు బాబు స్వామి ని అభినందించారు. అదే విధంగా భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ గ్రామ, మరియు ప్రభుత్వ పాటశాలల అభివృద్ధికి కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో గ్రామ తాజా మాజీ సర్పంచ్ ఎడవెళ్లి అరుణ-లక్ష్మా రెడ్డి, ఎంపీటీసీ గాండ్ల లక్ష్మీ-సత్తయ్య, అన్నారపు కనకయ్య( ఉప సర్పంచ్), కలీలోద్దీన్, నలువాల వీర రెడ్డి, కొత్త లచ్చయ్య, సంధి మల్లారెడ్డి, గుంటుకు లింగయ్య, కొత్త .మధుకర్, జంగిలి గణేష్, కట్ట రాజు మరియు గ్రామ యువత, తదితరులు పాల్గొన్నారు.

Please follow and like us:

You may also like...