Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలి

జగిత్యాల లో అఖిలపక్ష నేతలు సమావేశం…

ఈరోజుటీవి/జగిత్యాల జిల్లా బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో త్వరలో నిర్వహించబోయే మున్సిపల్, గ్రామ పంచాయతీలకు జరిగే ఎన్నికల్లో జనాభా ప్రాతిపదికన బీసీలకు 53 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, జగిత్యాల అఖిలపక్ష నేతలు డిమాండ్ చేశారు. బుధవారం జిల్లా కేంద్రంలోని మార్కండేయ ఆలయంలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అఖిలపక్ష సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి 72 సంవత్సరాలు గడుస్తున్నా బీసీలను ఓటు బ్యాంకులుగా వినియోగించుకుంటూ కుల వృత్తుల ప్రోత్సాహం అంటూ గొర్లు, బర్లు, చేపలు ఇలా సమాజంలోని కుల వృత్తుల వారిని మచ్చిక చేసుకుంటూ రకరకాలుగా తాయిలాలు ప్రకటిస్తూ బీసీలను రాజ్యాధికారానికి దూరం చేస్తున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రస్తుతం జరుగుతున్న బీసీ జనాభా గణన త్వరగా పూర్తి చేసి జనాభా దామాషా ప్రకారం బీసీలకు ప్రాముఖ్యత ఇస్తూ రాజ్యాధికార సాధన దిశగా పాలకులు సహకరించి బిసి జనోద్ధరణకు పాటుపడాలని కోరారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బిసి రిజర్వేషన్ల అమలు లో ఆదిలాబాద్ ,భద్రాది ,కొత్తగూడెం లలో బీసీ రిజర్వేషన్ల కల్పించకపోవడం శోచనీయమని, వెంటనే జిల్లాలకు కూడా రిజర్వేషన్లను కల్పించాలని అన్నారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు గాజుల నాగరాజు, భార్గవ్ రామ్, ఓరుగంటి, భూమి రమణ, బండ శంకర్, బాల శంకర్, పి. సతీష్ రాజు ,జంగిలి రాజేష్ ,పులి నరసయ్య ,వనమాల శ్రీనివాస్, సిరిపురం మహేందర్ ,ఎస్ .విజయ్,ధీటి సతీష్, వీర్ల తిరుపతి ,కందుకూరి తిరుపతి, భోగ గంగాధర్, కట్ట విజయ్ ,మగ్గిడి దేవయ్య, ఓరుగంటి పెద్దిరాజు, తదితరులు పాల్గొన్నారు.

Please follow and like us:

You may also like...