Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

29న టీవీ చానళ్లు ఆగిపోవు: ట్రాయ్‌

ఈరోజుటీవి/న్యూఢిల్లీ/హైదరాబాద్‌ డిసెంబరు 27: ఈ నెల 29 నుంచి అమలులోకి రానున్న కొత్త కేబుల్‌ నిబంధనల వల్ల టీవీ చానళ్ల ప్రసారాలకు అంతరాయం ఉండదని టెలికాం నియంత్రణ సంస్థ (టాయ్‌) స్పష్టం చేసింది. ఈ నెల 29 తర్వాత సబ్‌స్రైబ్డ్‌ చానళ్ల ప్రసారాలు నిలిచిపోతాయని జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో ట్రాయ్‌ బుధవారం వివరణ ఇచ్చింది. వినియోగదారులు ఇవాళ చూస్తున్న ఏ చానల్‌ కూడా ఈ నెల 29న ఆగిపోదని, ఈ మేరకు ఆపరేటర్లకు ఆదేశాలు జారీ చేస్తున్నట్లు పేర్కొంది. ప్రతి వినియోగదారుడికి ఇష్టమైన చానళ్లను ఎంపిక చేసుకోవడానికి తగు సమయం ఉంటుందని తెలిపింది. కాగా, ట్రాయ్‌ ప్రతిపాదించిన ధరలు తమకు ఆమోదయోగ్యం కాదని తెలంగాణ, ఏపీ రాష్ట్రాల టీవీ వీక్షకుల సంఘం ప్రతినిధులు తెలిపారు. వీక్షకులు ఉచిత చానళ్లను మాత్రమే చూడాలని, పెయిడ్‌ చానళ్లకు డబ్బులు కట్టవద్దని కోరారు.

Please follow and like us:

You may also like...