Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

రెండొందల ఏళ్ల చరిత్ర కలిగిన పురాతనమైన చర్చి

పురాతనమైన చర్చి అపురూప కట్టడం ఆనాటి చరిత్రకు ఆనవాళ్ళు ….

ఈరోజుటీవి/కృష్ణ/రాఘవాపురం: కృష్ణాజిల్లా నందిగామ మండలం రాఘవపురం గ్రామం లో రెండు వందల ఏళ్ల చరిత్ర కలిగిన చర్చి నందిగామ కు అతి చేరువలో మునేటి  ఒడ్డున 
ఈ చర్చి ఎవరు నిర్మించారు. అసలు ఎందుకు నిర్మించబడింది. వివరాల్లోకి వెళితే రాఘవాపురం గ్రామానికి చెందిన వ్యక్తి పాగొలు వెంకయ్య అనే వ్యక్తి గజదొంగ తన జీవన శైలి గడుపుతున్న క్రమంలో విజయవాడ కృష్ణా నది తీరమున క్రైస్తవ కూటములలో ఒక దైవజనుడు ఏసుక్రీస్తు జీవన విధానం క్రైస్తవ మత విలువలను ప్రసంగిస్తున్న తరుణంలో గజదొంగ దైవజనుడు చెప్పే ప్రసంగానికి మారుమనసు పొంది తన గజదొంగ జీవన విధానాన్ని కి స్వస్తి పలికి తన స్వగ్రామమైన టువంటి రాఘవాపురం లో ఒక చర్చిని నిర్మించాలని ఒక మంచి ఆలోచన అతనికి కలిగింది 1855లో స్టాన్ విలిగ్బన్ వీనస్ టానర్ దొరల చేయి పునాది వేయించ పడింది కృష్ణాజిల్లాలో మత వ్యాప్తి కి మరియు ఆంగ్ల విద్యా వ్యాప్తికి ఇది తొలిమెట్టుగా పేర్కొనబడింది.
రాఘవాపురం గ్రామానికి చెందిన వ్యక్తులు ఎక్కడ ఉన్నా మే నెల పుణ్యక్షేత్ర మహోత్సవమునకు తప్పనిసరిగా హాజరై తమ కృతజ్ఞతలు తెలుపు కొనుటకు వస్తుంటారు పాగొలు వెంకయ్య తాను దైవ సేవకుడిగా మారి సుమారు ఐదు సంవత్సరముల ఈ చర్చి నిర్మించడం జరిగింది ఈ దేవాలయానికి క్రిస్మస్ సమయంలో చుట్టుపక్కల గ్రామం నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు భక్తి శ్రద్ధలతో పూజలు ఆచరించి దేవాలయ అభివృద్ధికి సంబంధించి సహాయ సహకారాలు అందిస్తూ ఎప్పటికప్పుడు దేవాలయ మరమ్మత్తులు చేస్తూ జాగ్రత్తగా చూసుకుంటారు బెల్లం సున్నం తో నిర్మించబడిన ఈ పవిత్రమైన దేవాలయం ఇప్పటికీ అందుకే చెక్కు చెదరకుండా అలనాటి కట్టడాలకు చిహ్నం గా మారి అశేష భక్తజన సందోహంతో విరాజిల్లుతోంది. మరింత సమాచారం కోసం క్రింద వీడియో చూడగలరు.

Please follow and like us:

You may also like...