Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

శ్రీశైలం ఆలయ వేదపండితుడి సస్పెన్షన్

ఈరోజుటీవి/కర్నూలు /శ్రీశైలం : శ్రీశైల భ్రమరాంబ ఆలయ ప్రధాన వేదపండితుడు గంటి రాధాకృష్ణ‌ సస్పెన్షన్‌కు గురయ్యారు. శ్రీశైలం దేవస్థానం పరిధిలో అర్ధరాత్రి తాంత్రిక పూజలు, హోమాలు నిర్వహించారని రాధాకృష్ణపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆలయ ఈవో శ్రీరామచంద్రమూర్తి చర్యలు తీసుకున్నారు. ఈ అంశం శ్రీశైలంలో తీవ్ర దుమారం రేపుతోంది.

దాచిన చిత్రం 

వేదపండితుడు గంటి రాధాకృష్ణ సస్పెన్షన్‌పై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. గంటి రాధాకృష్ణకు, ఆలయ ఈవో రామచంద్రమూర్తికి మధ్య కోల్డ్‌వార్ నడుస్తోందనే ప్రచారం శ్రీశైలంలో ఉంది. ఈవోను ఏదో చేయాలన్న ఉద్దేశంతో వేదపండితుడు రాధాకృష్ణ రహస్యంగా తన ఇంట్లోనే తాంత్రిక పూజలు, హోమాలు చేస్తున్నారనే పుకార్లు షికార్లు చేశాయి. గంటి రాధాకృష్ణ అర్ధరాత్రి పూట చేసే పూజలు, హోమాలపై దేవస్థానం ఉద్యోగులు నిఘా పెట్టి విషయాన్ని ఈవో రామచంద్రమూర్తితో పాటు ఉన్నతాధికారులు దృష్టికి తీసుకెళ్లి ఆయనను సస్పెండ్ చేయించారనే ప్రచారమూ జరుగుతోంది.

అయితే తాను తాంత్రిక పూజలు, హోమాలు చేసినట్లు వచ్చిన ఆరోపణలను వేదపండితుడు గంటి రాధాకృష్ణ కొట్టిపారేశారు. తాను ఈవోకు సహకరించలేదనే కారణంతో కక్ష్యగట్టి ఉద్దేశపూర్వకంగానే సస్పెండ్ చేశారని అంటున్నారు. మొత్తానికి శ్రీశైలంలో ఈవో, వేదపండితుడికి మధ్య వివాదం తీవ్ర దుమారం రేపుతోంది.

Please follow and like us:

You may also like...