Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

ఫ్రంట్..గింట్ జాన్తా నై..కేసీఆర్‌కు షాకిచ్చిన పట్నాయక్..!

బిజూ జనతాదళ్‌తో జట్టు కడతా… ఫెడరల్

ఈరోజుటీవి/హైదరాబాద్/చీఫ్ బ్యూరో: ఫ్రంట్ పెడతా అంతూ.. ఎగేసుకుని పోయిన కేసీఆర్..కు ఒడిషా సీఎం పట్నాయక్..తనకు అలవాటైన పెయింంటింగ్ ను కేసీఆర్ మొహానికి పూసి… గుళ్లకు పంపించారు. లోక్ సభ ఎన్నికల గురిచి… ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదని.. పట్నాయక్ స్పష్టం చేయడంతో… కేసీఆర్.. ఇక పట్నాయక్ ముందు ఫ్రంట్ మాటే ఎత్తలేకపోయారు. దాంతో  ఇక రైతు బంధు పథకం, మహిళా రిజర్వేషన్ల గురించి చర్చించుకుని, బయటకు వచ్చి మీడియా ముందు,  కేసీఆర్ భావసారూప్య పార్టీలన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు. కానీ తన పార్టీకి కేసీఆర్ చెప్పే ఫెడరల్ ఫ్రంట్ కి భావసారూప్యం ఉందో లేదో చెప్పలేదు.

మహిళా రిజర్వేషన్ల అంశం, తెలంగాణలో రైతుల కోసం అమలు చేస్తున్నపథకాలపై చర్చించామని తెలిపారు. ఇంత చేసినా నవీ‌న్ పట్నాయక్ ఫెడరల్ ఫ్రంట్ గురించి మాత్రం, చిన్న ప్రస్తావన కూడా చేయలేదు. విచిత్రం ఏమిటంటే.. మహిళా బిల్లుకు మద్దతిస్తానని కేసీఆర్ ప్రకటించారు. కేసీఆర్ గత ఎన్నికల్లో నాలుగు సీట్లు కూడా మహిళలకు కేటాయించ లేదు. అసలు దేశంలో మహిళలు లేని మంత్రి వర్గాన్ని కేసీఆర్ నిర్వహించారు. ప్రాంతీయ పార్టీల నేతలు ఏకం కావాల్సిన అవసరం ఏర్పడిందని కేసీఆర్ మీడియాకుచెప్పుకుని… ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చర్చలు ప్రారంభ దశలోనే ఉన్నాయని కవర్ చేసుకున్నారు. మరోసారి నవీన్‌ పట్నాయక్‌తో సమావేశం అవుతానని చెప్పుకొచ్చారు.

కేసీఆర్ భువనేశ్వర్‌లోని సీఎం అధికారిక నివాసంలో బస చేస్తారు. సోమవారం సాయంత్రం 4 గంటలకు పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీతో సమావేశం అవుతారు. కేసీఆర్.. కొద్ది రోజులుగా హడావుడి చేస్తున్నట్లుగా… జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పు దిశగా.. పడిన తొలి అడుగు అంత గొప్పగా సక్సెస్ కాలేదు. నవీన్ పట్నాయక్ నైజం.. ఢిల్లీకి దూరంగా ఒంటరిగా ఉండటమే. అదే ఫాలో అవడానికి ఆయన సిద్ధపడ్డారని… కేసీఆర్ భేటీ తర్వతా ఆయన మాటలు చూస్తే అర్థమవుతోంది. మొత్తానికి కేసీఆర్ హడావుడి చేయాలనుకుని మొదటికే మెత్తబడిపోయారు.

Please follow and like us:

You may also like...