Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

తండ్రి బాటలో తనయుడు…!

చెట్టొకటి అయితే విత్తనం మరొకటి అవుద్దా అన్న నానుడి ని నిజం చేసిన  ఎల్లాల తనయుడు…చిట్టి చేతులతో పెద్ద సాయం..ఎందరికో ఆదర్శంగా !

విద్యార్థినికి చేయూత నిస్తున్న డా. ఎల్లాల శ్రీనివాస్ రెడ్డి తనయుడు శ్రీ శరణ్

ఈరోజుటీవి/జగిత్యాల/టౌన్: త్రిబుల్ ఐటీ విద్యార్థినికి రూ.12వేల ఆర్థిక సాయం అందించడానికి డా ఎల్లాల శ్రీనివాస్ రెడ్డి కొడుకు అయినా ఎల్లాల శ్రీ శరణ్ ముందుకొచ్చాడు.వివరాల్లోకి వెళితే జగిత్యాల పట్టణానికి చెందిన ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు, సామాజిక సేవా దృక్పధం తో ఎందరికో మంచి జీవితాన్ని ఇచ్చినటువంటి మహానుభావుడి సుపుత్రుడు ఈ మధ్యే జరిగిన  మ్యాథ్స్ డే సందర్భంగా అల్ఫోర్స్ కాలేజ్ మరియు ఎన్.ఎస్.వి డిగ్రీ కాలేజ్ వారు కలిసి సంయుక్తంగా నిర్వహించిన ఒలంపియాడ్ టాలెంట్ టెస్ట్ లో ఫస్ట్ ర్యాంక్ సాధించిన ఎల్లాల శ్రీ శరణ్ తనకు నగదు రూపంలో లభించిన మొత్తాన్ని తన తండ్రి డాక్టర్ ఎల్లాల శ్రీనివాస రెడ్డి ద్వారా త్రిబుల్ ఐటీ బాసర రెండవ సంవత్సరం చదువుతున్న స్వప్న కు ఫీజు రీత్యా అందించడం జరిగింది, ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ నగదు బహుమతి పొందిన శ్రీ శరణ్ ఈ డబ్బులు ఏం చేస్తావ్ అని అడగగానే ఎవరైనా విద్యార్థికి అందజేస్తే బాగుంటుందని చెప్పడం  ఇలాగ  తన తనయుడి మాటలు విన్న ఆ తండ్రి ఉబ్బితబ్బిపోయారని తెలుస్తోంది. ఏది ఏమైనా మనకు ఏమి లాభం అని ఓ కార్యక్రమమో, లేదా ఓ పనో చేసే ముందు ఒకటికి పదిమార్లు ఆలోచించే ఉరుకుల పరుగుల ఈ కాలం లో ఇలాంటి తండ్రి, తనయుడు ఈ జిల్లాలో ఉండటం ఎంతో గొప్ప విషయం గా చెప్పుకునే విషయం అని పలువురు కొనియాడుతున్నారు.  ఈ సందర్భాంగా ఎల్లాల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ నాకు ఈరోజు  చాలా సంతోషం అనిపించిందని, విద్యార్థుల కష్టాలు తెలుసుకొని, కలిసికట్టుగా విజయాల బాటలో నడవడం ఆహ్వానించదగ్గ విషయం అని ఆయన స్పష్టం చేసారు. అరుణ హాస్పిటల్ లో జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీ చంద్రజ, సుధాకర్, బాబుస్వామి, తదితరులు పాల్గొన్నారు.

Please follow and like us:

You may also like...